తమ్ముడు బ్రహ్మాజీ అంటూ నాగశౌర్య కౌంటర్.. యంగ్ టాలెంట్‌కి సపోర్ట్ కావాలంటూ షాకింగ్ పోస్ట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 23 July 2021

తమ్ముడు బ్రహ్మాజీ అంటూ నాగశౌర్య కౌంటర్.. యంగ్ టాలెంట్‌కి సపోర్ట్ కావాలంటూ షాకింగ్ పోస్ట్

సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫొటో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యంగ్ హీరో నాగశౌర్య. నా తమ్ముడు అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. యాక్టర్ బ్రహ్మాజీ, కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకొచ్చింది. కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న బ్రహ్మాజీ నాగశౌర్య ఓ ఫోటోకి పోజిచ్చారు. ఇద్దరూ పంచెకట్టు లుక్‌లో కనిపించి అట్రాక్ట్ చేశారు. నాగశౌర్య నుదుట కుంకుమ రేఖ ఉండగా, బ్రహ్మాజీ నుదుట నామాలు ధరించి ఉన్నాడు. ఈ ఫొటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన నాగశౌర్య.. ''నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ యంగ్ టాలెంట్'' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కావడమే గాక సినిమాకు ప్రమోషన్ ఇచ్చినట్లయింది. ఇది చూసి యంగ్ హీరో ఐడియా అదిరింది అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే నాగశౌర్య షేర్ చేసిన ఈ ఫొటో చూస్తుంటే.. బహుశా ఏదైనా పూజకు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. నాగశౌర్య కెరీర్‌లో 22వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాతో షెర్లీ సెటియా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అతి త్వరలో షూటింగ్ ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు తేవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from https://ift.tt/36WfKgk

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages