బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన సత్యరాజ్‌కు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మొదటి పార్ట్ చూసిన ప్రతీ ఒక్కరికి ఒక ప్రశ్న మొదలుతుంది. కచ్చితంగా రెండో పార్ట్ కోసం ఎదురూచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా అంతటి ప్రభావం చూపించింది పాత్ర. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశం నలుమూలలా వినిపించింది. అలా కటప్పగా చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అంతకు ముందు సత్యరాజ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా కట్టప్పగానే గుర్తించడం మొదలుపెట్టేశారు. అయితే బాహుబలి సినిమా తరువాత సత్యరాజ్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. తాతగా, తండ్రిగా స్పెషల్ రోల్స్ వచ్చాయి. అయితే సత్యరాజ్ ఇప్పుడు కొత్త అవతారాన్ని ఎత్తారు. యాడ్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రిస్టిన్ కేర్ గురించి చెబుతూ ఓ యాడ్‌లో నటించేశారు. ఈ మేరకు తన కట్టప్ప పాత్ర విశేషాలను వాడుకున్నారు. ‘ఆ వీరత్వం, భయంకరం, కట్టప్ప కోపంగా ఉన్నప్పుడే. ఎన్ని యుద్దాలు, ఎన్ని వెన్నుపోట్లు.. అయినా కట్టప్పని మీకు దగ్గరి చేసింది.. బాహుబలి మీదున్న కేరింగ్, మాహిష్మతి మీదున్న బాధ్యత. బయట కూడా అలా ఉంటారా? అని అనిపిస్తుంది. కానీ సర్జరీ కోసం ప్రిస్టిన్ కేర్‌కు వెళ్తే అక్కడ పర్సనల్ కేర్ బడ్డీ అనే వాళ్లు ఉంటారు. హాస్పిటల్ అపాయింట్మెంట్, ఇన్సూరెన్స్, ట్రీట్మెంట్ ఇలా అన్నీ వాళ్లే చూసుకుంటారు.. మీ నవ్వు చూడటానికి.. అందుకే సర్జరీ అంటే ప్రిస్టిన్ కేర్’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి కట్పప్ప పాత్రను ఇలా కూడా వాడుకుంటున్నారు.
from https://ift.tt/3kMebtz
No comments:
Post a Comment