క్యారెక్టర్ ఆర్టిస్ట్ , ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఏ రేంజ్ హంగామా చేస్తారో మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా సుప్రిత అయితే సోషల్ మీడియా వాల్‌పై కనిపించని రోజంటూ ఉండదు. నిత్యం అట్రాక్ట్ చేసే ఫొటోలతో పాటు స్పూఫ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇప్పటికే హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుందామె. అయితే సుప్రిత హవా చూసి ఇదంతా సినిమాల్లో ఛాన్స్ కోసం అనే చర్చలు ముదిరాయి. గతంలో సురేఖావాణి కూడా ఈ విషయమై రియాక్ట్ అవుతూ సుప్రితకు సినిమాల్లోకి రావడం ఇష్టమైతే తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. దీంతో త్వరలోనే సురేఖావాణి కూతురు ఉంటుందని చెప్పుకుంటున్నారు జనం. ఈ పరిస్థితుల్లో మరోసారి తన కూతురు సినీ ఎంట్రీపై క్లియర్ హింట్ ఇచ్చింది సురేఖావాణి. సోషల్ మీడియా చిట్ చాట్‌లో మీ కూతురు సినీ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్నపై రియాక్ట్ అవుతూ.. ప్రస్తుతం సుప్రిత స్టడీస్‌తో బిజీగా ఉందని, అలాగే నటనలో కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో స్పష్టమైన డైలాగ్ డెలివెరీ కోసం ఓ గురువు వద్ద ట్రైనింగ్ తీసుకుంటోందని తెలిపింది. కాకపోతే ఇప్పటికైతే సుప్రిత సినీ ఎంట్రీ అనేది ఫిక్స్ కాలేదని చెప్పింది. ఒకవేళ ఫిక్స్ అయితే ముందే చెబుతానని ఆమె తెలిపింది. తల్లి సురేఖావాణితో కలిసి చిందులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలిన సుప్రిత.. ఇప్పుడు సోలో పర్‌ఫార్‌మెన్స్‌తో సత్తా చాటుతోంది. తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుస వీడియోలు పోస్ట్ చేస్తూ పరేషాన్ చేస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అప్పట్లో తన తల్లి రెండో పెళ్లి మ్యాటర్‌పై కామెంట్స్ చేసి సీరియస్ అయింది సుప్రిత.
from https://ift.tt/3BwrUe2
No comments:
Post a Comment