మహేష్ బాబుతో త్రిష రొమాన్స్! అలా కనిపించబోతున్న క్రేజీ కాంబో.. భారీ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 26 July 2021

మహేష్ బాబుతో త్రిష రొమాన్స్! అలా కనిపించబోతున్న క్రేజీ కాంబో.. భారీ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

అదేంటో కొన్ని కాంబోలు వెండితెరపై ఓ మార్క్ క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్స్ చేసే మ్యాజిక్, వారి మధ్య కెమిస్ట్రీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి క్రేజీ కాంబోలో ఒకటే మహేష్ బాబు- జోడీ. ఈ ఇద్దరి కాంబినేషన్ వచ్చిన 'అతడు' మూవీ ఏ రేంజ్‌లో హిట్టయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇదే జోడీ 'సైనికుడు' సినిమాలో మహేష్- త్రిష రొమాన్స్ చేసి మ్యాజిక్ క్రియేట్ చేశారు. అయితే అది జరిగిన 15 ఏళ్లకు మళ్ళీ ఈ జోడీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందని తెలుస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు ఓ సినిమా రూపొందించనున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండబోతోంది. దీనిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకోవడంతో రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుతో త్రిష రొమాన్స్ చేయనుందనే న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని, అందులో ఒకరిగా త్రిష కనిపించనుందని అంటున్నారు. కథ ప్రకారం మహేష్- త్రిషలను టీనేజ్ లవర్స్‌గా చూపించబోతున్నారట త్రివిక్రమ్. ఇకపోతే ఈ మూవీలో మరో హీరోయిన్‌ రోల్ కోసం పూజాహెగ్డే, జాన్వీ కపూర్, నివేదా థామస్, కియారా అద్వానీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇన్ని ఆసక్తికర విషయాల నడుమ మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఉన్న అంచనాలు కొండెక్కాయి. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నారు .


from https://ift.tt/3rDBHum

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages