‘ఆయనతో జాగ్రత్తగా ఉండు’.. నటుడు నాగశౌర్యకు రానా ఉపదేశం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 24 July 2021

‘ఆయనతో జాగ్రత్తగా ఉండు’.. నటుడు నాగశౌర్యకు రానా ఉపదేశం

తెలుగు హీరోలలో ప్రస్తుతం బాగా పాపులారిటీ ఉన్న హీరో ఎవరంటే ముందుగా అందరు హీరో ‘నాగశౌర్య’ పేరు చెబుతారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ తదితర సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. కొద్ది రోజుల క్రితం ‘అశ్వథ్దామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . త్వరలో ‘లక్ష్య’, ‘వరుడు కావలెనను’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం నాగశౌర్య తన బాడీని ట్రాన్స్‌ఫార్మ్ చేసే పనిలో ఉన్నారు. ‘అశ్వథ్థామ’లో కండలు తిరిగిన దేహంతో కనిపించిన నాగశౌర్య.. ఇప్పుడు మరింత ఎక్కువగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా శౌర్య 8 ప్యాక్స్ ఫోటో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రముఖ నటుడు బ్రహ్మాజీతో కలిసి శౌర్య ఓ పిక్ దిగి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఓ సినిమా షూటింగ్ తర్వాత దిగిన పిక్‌ని ఆయన షేర్ చేశారు. షూట్‌ అనంతరం బ్రహ్మాజీ ముఖానికి నామాలు పెట్టుకుని ఉన్న ఈ ఫొటోని షేర్‌ చేసిన శౌర్య.. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి ఉండాలి. దయచేసి యంగ్‌ టాలెంట్‌ని ప్రోత్సహించండి’ అని సరదాగా ట్వీట్‌ చేశాడు. దీని బ్రహ్మాజీ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. ‘నీ సపోర్ట్‌కి థాంక్యూ అన్న.. యంగ్ టాలెంట్‌ని బాగా పుష్ చేస్తున్నావ్’ అంటూ ఆయన రీట్వీట్ చేశారు. తాజాగా ఈ ట్వీట్లపై మరో నటుడు స్పందించాడు. ‘వామ్మో!! ఇదేంటి గురు.. నాగశౌర్య.. కాస్త జాగ్రత్తగా ఉండు. ఆయన లుక్‌లోనే ఏదో తేడా ఉంది’’ అంటూ రానా పేర్కొన్నారు. దీనిపై రియాక్ట్ అయ్యారు. ‘చిన్నపిల్లవాడిని ర్యాగింగ్ చేయవద్దు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు.. నాగశౌర్య కూడా దీనికి రిప్లే ఇచ్చారు. ‘కరెక్టే భయ్యా నువ్వు చెప్పింది. నాకు ఏదో తేడా కొడుతోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే’ అంటూ శౌర్య ట్వీట్ చేశారు.


from https://ift.tt/2Vbnet7

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages