‘ఆర్ఆర్ఆర్’ కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. కీరవాణిని పక్కన పెట్టి మరీ జక్కన ప్లాన్! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 21 July 2021

‘ఆర్ఆర్ఆర్’ కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. కీరవాణిని పక్కన పెట్టి మరీ జక్కన ప్లాన్!

‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్ తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. , రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా వాళ్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్లు.. తాజాగా విడుదలైన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చిన్న ట్రయల్ ఇచ్చాయి. అసలు ఈ టీజర్లు, మేకింగ్ వీడియోలే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు అశ్చర్యపోతున్నారు. అక్టోబర్ 13వ తేదీ ఎప్పుడు వస్తుందా. సినిమాని ఎప్పుడు థియేటర్లలో చూడాలా అని వాళ్లు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న రాజమౌళి ఓ సరికొత్త వ్యూహాన్ని రచించారు. మామూలుగా రాజమౌళి సినిమా అంటే సంగీత దర్శకుడు ఎంఎం ఉంటారు. జక్కన ప్రతీ సినిమాలో ఏ పాటకి అయినా కీరవాణినే సంగీత దర్శకుడిగా ఎంచుకుంటారు. కానీ, మొదటిసారిగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆయన ఓ కొత్త సంగీత దర్శకుడిని ఎంచుకున్నారట. ఈ సినిమా ప్రమోషనల్ పాటకి సంగీతం అందించేందుకు ఆయన యువ దర్శకుడు అనిరుద్ రవిచందర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట బయటకు వస్తుందనే టాక్‌ కూడా బలంగా వినిపిస్తోంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత అనిరుధ్ తెలుగులో చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.


from https://ift.tt/3rp2KJv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages