టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్ లిఫ్టింగ్‌లో మణిపూర్‌కి చెందిన మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. స్నాచ్‌లో 87 కేజీలను లిప్ట్ చేసి.. క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలను లిప్ట్ చేయడం ద్వారా భారత్‌కి పతకాన్ని ఖాయం చేసింది. మొత్తంగా 202 కిలోలను మీరాబాయి లిప్ట్ చేయగా.. చైనా క్రీడాకారిణి జిహు ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ మొత్తంగా 210 కేజీలను లిప్ట్ చేసింది. ఈ సందర్భంగా మీరాభాయ్ కృషి ప్రోత్సహిస్తూ.. సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. భారత్‌కు మెడల్ సాధించిన ఆమెను అభినందిస్తూ.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇలాంటి క్షణం కోసమే కదా.. ఎంతోకాలంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తుంది అంటూ మహేశ్ పేర్కొన్నారు. ‘ఇది అందరూ కోరుకొనే ఆరంభం.. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతాకం సొంతం చేసుకున్న మీరాభాయ్ చానుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్షన్ ఇప్పుడే మొదలైంది’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ బాబుతో పాటు.. పవర్‌స్టార్, జనసేన పార్టీ అధినేత కూడా మీరాభాయ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన సందేశాన్ని జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి మెడల్ సాధించినందుకు మీరాభాయ్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని.. జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
from https://ift.tt/2TvSdjc
No comments:
Post a Comment