‘నారప్ప’ మూవీ రివ్యూ.. వెంకటేష్ విశ్వరూపం! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 19 July 2021

‘నారప్ప’ మూవీ రివ్యూ.. వెంకటేష్ విశ్వరూపం!

రీమేక్ కథలు తెరకెక్కించడం అంత సులభమైన పనేమీ కాదు. నటించే హీరోకు, తెరకెక్కించే దర్శకుడికి అతి కత్తి మీద సాము వంటిది. కథలోని మూలం చెడకుండా రీమేక్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే రీమేక్‌లు చేసినా కూడా దాని పోలికలు పడకుండా జాగ్రత్త పడే విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు (తమిళంలో అసురన్)గా వచ్చారు. నేడు (జూలై 20) అమెజాన్ ప్రైమ్‌లో నారప్ప విడుదలైంది. అయితే వెంకీ నారప్పగా ఏ మేరకు మెప్పించారో ఓ సారి చూద్దాం. ఈ కథ రామసాగరం అనే ఊరిలో సాగుతుంది. అక్కడి భూస్వామి పాండుసామి (నరేన్) తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఊర్లో అందరి భూమిని లాక్కోవాలని చూస్తుంటాడు. నారప్ప ()కు చెందిన మూడు ఎకరాలు తప్పా ఊర్లోని పొలమంతా కూడా పాండుసామి చేతుల్లోకి వెళ్తుంది. నారప్ప ఓ తాగుబోతులా జీవితాన్ని గడుపుతుంటారు. అతని పెద్ద కొడుకు ముని ఖన్నా (కార్తీక్ రత్నం) ఆవేశ పరుడు. మాత్రం పాండుసామికి ఎదురుతిరుగుతాడు. తనకు జరిగిన అవమానంతో పాండుసామి ముని ఖన్నా చంపేస్తాడు. అయినా కూడా నారప్పలో చలనం రాదు. తన కొడుకును చంపేశారని సుందరమ్మ (ప్రియమణి) బాధపడుతూనే ఉంటుంది. తల్లి బాధను చూడలేక నారప్ప రెండో కొడుకు సిన్నబ్బ (రాఖీ) పాండుసామిని చంపేస్తాడు. ఇక తన రెండో కొడుకు అయినా కాపాడుకోవాలని నారప్ప చేసే ప్రయత్నాలు ఏంటి? అసలు నారప్ప ఎందుకు అలా తాగుబోతుగా, ఏమీ చేతగాని వాడిలా కొడుకు ముందు నిల్చుంటాడు? నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అన్నదే కథ. నారప్పగా వెంకటేశ్ అద్భుతంగా నటించారు. రోషం, పౌరుషం లేని తాగుబోతు తండ్రిగా వెంకటేశ్ నటన అద్బుతం. అన్నకు బదులు నువ్ చచ్చిపోయినా బాగుండేదని కొడుకు అనడం, ఏమీ చేతగాని వాడివంటూ కొడుకు గేలి చేసిన సందర్భంలోనూ వెంకటేష్ కన్నీళ్లు పెట్టిస్తాడు. అలా ప్రతీ ఒక్క సీన్‌లో వెంకటేష్ విశ్వరూపమే కనిపిస్తుంది. యాక్షన్, ఎమోషనల్ ఇలా ప్రతీ సీన్‌లో వెంకటేష్ ఇరగదీసేశాడు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి అద్భుతంగా నటించింది. ముని ఖన్నాగా కార్తీక్ రత్నం, సిన్నబ్బగా రాఖీ, బసవయ్యగా రాజీవ్ కనకాల, లాయర్ వరదరాజులుగా రావు రమేష్, శంకరయ్యగా నాజర్ ఇలా ప్రతీ ఒక్కరూ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించేశారు. నారప్ప కథ మనది కాదు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాశారు. అక్కడ జరిగిన యథార్థ ఘటనలు, ఒకప్పుడు బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొన్న సంఘటనల ఆథారంగా వెట్రిమారన్ అసురన్ కథను తెరకెక్కించారు. ఆ చిత్రాన్ని ఇక్కడ నారప్పగా రీమేక్ చేశారు. టైటిల్స్‌లోనూ కథ, స్క్రీన్ ప్లే వెట్రిమారన్ వేసి క్రెడిట్ ఇచ్చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా శ్రీకాంత్ అడ్డాల కొన్ని మార్పులు చేశారు. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మాత్రం నారప్ప విషయంలో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నట్టే. ప్రతీ ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశారు. పేదవాళ్లు-పెద్దవాళ్లు, నిమ్న-అగ్ర వర్ణాలు అంటూ సమాజంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. బలహీన వర్గాలకు చెందిన వారు కనీసం చెప్పులు వేసుకుంటే కూడా ఓర్వలేనితనాన్ని చూపించారు. వారిని శ్రమను ఎలా దోపిడి చూసి భూస్వామ్యులుగా ఎదిగారో చూపించారు. నారప్ప కథ ఇలా ఎన్నో అంశాలను అంతర్లీనంగా చెబుతూనే ఉంటాయి. సామాజిక స్పృహ కలిగించేలా.. సమాజంలోని అసమానతలను చూపించేలా రాసుకున్న ఈ కథ అందరినీ కదిలిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల రాసిన మాటలు కూడా అందరినీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ట్రైలర్‌లో చెప్పినట్టు.. డబ్బు, భూమి ఉంటే తీసుకుంటారు గానీ చదువును మాత్రం మన నుంచి తీసుకోలేరు.. ఈ ఒక్క మాటలోనే సినిమా మూలం దాగి ఉంటుంది. అలా ఈ కథలోని జీవాన్ని ఒదలకుండా ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించేశారు. అయితే అసురన్ సినిమాను ఇది వరకే చూసిన వాళ్లకు కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ నారప్పను నేరుగా చూసేవాళ్లు మాత్రం కచ్చితంగా షాక్ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఒళ్లు గగుర్పొడిచేలా చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ ఎలాంటి మార్పులు చేసినట్టు కనిపించడం లేదు. తమిళంలో ఉన్నదే ఇక్కడా వాడుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే కాబోలు.. టైటిల్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఇక మణిశర్మ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇలా అన్నీ కలిసి నారప్పను తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేస్తుంది. అసురన్‌ చూడకుండా నేరుగా నారప్పను చూసేవారు మరింత కొత్త అనుభూతికి లోనవుతారు. చిరవగా : నారప్ప.. అదరగొట్టేసావప్ప


from https://ift.tt/3rj2coy

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages