‘హంగామా 2’ మూవీ రివ్యూ.. బోర్ కొట్టించిన పాత కాన్సెప్ట్‌ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 24 July 2021

‘హంగామా 2’ మూవీ రివ్యూ.. బోర్ కొట్టించిన పాత కాన్సెప్ట్‌

సినిమా విషయంలో ఎన్నో విశేషాలున్నాయి. ఎనిమిదేళ్ల తరువాత ప్రియదర్శన్ డైరెక్షన్ చేయడం, పద్నాలుగేళ్ల తరువాత శిల్పా శెట్టి నటించడం వంటి ఆసక్తికరమై అంశాలతో హంగామా 2పై అందరికీ అంచనాలు పెరిగాయి. 1994లో మలయాళంలో వచ్చిన మిన్నారం సినిమా ఆధారంగా హంగామా 2ను రూపొందించారు. అలాంటి ఈ చిత్రంతో ప్రణీత సుభాష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నేడు (జూలై 24) హాట్ స్టార్‌లో ఈ చిత్రం విడుదలైంది. హంగామా 2 కథ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. రిటైర్డ్ జైలర్ కపూర్ (అశుతోష్ రాణా) కుమారుడు ఆకాశ్ కపూర్ (మీహాన్ జఫ్రీ) తన భర్త అని, తన బిడ్డ గెహనకు తండ్రి అని వాణి (ప్రణీత సుభాష్) ఆరోపిస్తుంది. సరాసరి ఇంటికి వచ్చి మకాం వేస్తుంది వాణి. ఆ సమయంలోనే కపూర్ తన కొడుకు ఆకాశ్‌కు తన మిత్రుడైన బజాజ్ (మనోజ్ జోషి) కూతురికి ఇచ్చిపెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. కాలేజీ రోజుల్లో తాము ప్రేమించుకున్నది నిజం కానీ.. ఈ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆకాశ్ చెబుతుంటాడు. అలా వాణి ఆరోపణలు ఒకవైపు, తానేమీ తప్పు చేయలేదని కొడుకు మరోవైపు.. కూతురి పెళ్లి అంటూ తన స్నేహితుడు బజాజ్ మరో వైపు ఇలా అన్ని వైపులా కపూర్‌కు సమస్యలు వచ్చి పడతాయి. ఇందులో ఆకాశ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అంజలి తివారి (శిల్పా శెట్టి)తో సమస్యలన్నీ చెప్పుకుంటూ బాధపడుతుంటాడు. కానీ ఆమె భర్త రాధే తివారి అనుమానుపు పిశాచి. రాధే తివారి ఆ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని భ్రమ పడతాడు. ఇలా కథనం ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే అసలు గెహన తండ్రి ఎవరు? ఆకాశ్ తన భర్త అని వాణి ఎందుకు ఆటలు ఆడుతుంది? చివరకు ఆకాశ్ వాణి కథ ఎలా ముగుస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే హంగామా 2. హంగామా 2లో ఆకాశ్ కపూర్ పాత్రలో మీహాన్ జఫ్రీ బాగానే నటించారు. కామెడీ, ఎమోషన్, డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా మెప్పించాడు. వాణి క్యారెక్టర్‌లో ప్రణీత సుభాష్ చక్కగా సరిపోయారు. అలాంటి పాత్రలు ఇది వరకే ఆమె ఎన్నో సినిమాల్లో పోషించారు. ఇక అంజలి తివారిగా శిల్పా శెట్టి అందంగా కనిపించారు. పరేశ్ రావల్ అయితే రాధే తివారిగా నవ్వులుపూయించారు. తన అనుమానంతో కామెడీని పంచేశారు. అశుతోష్ రానా, రాజ్ పల్ యాదవ్ ఇలా అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేసేశారు. హంగామా 2 సినిమాను తెలుగు ప్రేక్షకులు చూస్తున్నంత సేపు ఏదో ఒక పాత సినిమా రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ సీన్లు, ఈ కథ, కథనం ఎక్కడో చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు కథ ఏంటన్నది ఇట్టే పసిగట్టేయోచ్చు. స్ట్రిక్ట్ ఫాదర్, ఇంట్లో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు, వారిని చూసుకునే ఓ పని మనిషి, అనుమానపు భర్త, అందంగా ఉన్న భార్యను అనవసరంగా అనుమానించడం, వేరే వారితో లింకులున్నాయని భ్రమ పడటం ఇలాంటి సీన్లన్నీ కూడా కొత్తగా ఏమీ అనిపించవు. హంగామా 2 కథ పరంగా గానీ, కథనం పరంగా గానీ కొత్తగా అనిపించదు. కామెడీ కూడా ఆశించినంత స్థాయిలో లేదు. ఇక మరీ ముఖ్యంగా క్లైమాక్స్ మరీ డల్‌గా అనిపిస్తుంది. ఏదో సీరియస్ ముగింపు ఉంటుందని ఆశించిన వారు కచ్చితంగా భంగపడాల్సిందే. ఏదో పెద్ద ప్రాబ్లంలో హీరోయిన్ ఉందని అంతా అనుకుంటే చివరకు దర్శకుడు తుస్సుమనిస్తాడు. అలా మొత్తానికి హంగామా 2 సినిమా భారీగానే బెడిసికొట్టేసినట్టు అనిపిస్తుంది. సినిమాలోని పాటలు వినసొంపుగానే ఉన్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. అయితే రెండున్నర గంటల సేపు కదలకుండా కూర్చుని చూసేంత పస ఈ చిత్రంలో లేదనిపిస్తుంది. మొత్తానికి హంగామా 2 గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. చివరగా.. హంగామా 2 చూస్తే భంగపడాల్సిందే


from https://ift.tt/2VcpjoE

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages