Namrata Shirodkar: మహేష్ బాబు 'AMB సినిమాస్‌'కు అంతర్జాతీయ గుర్తింపు.. నమ్రత క్రేజీ రియాక్షన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 16 April 2021

Namrata Shirodkar: మహేష్ బాబు 'AMB సినిమాస్‌'కు అంతర్జాతీయ గుర్తింపు.. నమ్రత క్రేజీ రియాక్షన్

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు నయా ట్రెండ్ కొనసాగిస్తూ వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. వెండితెరపై అలరిస్తూనే బిజినెస్‌నెస్ పర్సన్లుగా సత్తా చాటుతున్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, కాజల్, సమంత.. ఇలా ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ''కు అంతర్జాతీయ గుర్తింపు రావడం సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. దీనిపై మహేష్ సతీమణి నమ్రత సైతం ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌ స్థాపించి పలు సినిమాలు రూపొందించడమే గాక.. మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన మహేష్ బాబు, 'ASIAN సినిమాస్‌'తో కలిసి హైదరాబాద్‌లో 'AMB సినిమాస్‌' పేరుతో అతిపెద్ద మల్టీప్లెక్స్ ప్రారంభించారు. అధునాతన హంగులతో అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో ఈ థియేటర్ స్టార్ట్ చేశారు. మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో కుడిన ఈ మల్టీప్లెక్స్‌లో వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ''లో గ్లోబల్ గుర్తింపు పొందింది ఈ థియేటర్. ఇనవేషన్ అవార్డ్స్-2021లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో AMB సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపిక కాబడింది. ఈ కేటగిరీలో భారతదేశం నుండి AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భాన్ని అభిమానులతో పంచుకున్న మహేష్ బాబు సతీమణి సోషల్ మీడియా వేదికగా AMB సినిమాస్ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో అద్భుతాలు సాధించాలని కోరుకుంటూ తన సందేశం పోస్ట్ చేశారు నమ్రత.


from https://ift.tt/3mRtX5m

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages