కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్.. సాయం కోసం సోనూ సూద్‌కి వేలల్లో ఫోన్ కాల్స్.. ఆయన రెస్పాన్స్ చూస్తే..! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 16 April 2021

కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్.. సాయం కోసం సోనూ సూద్‌కి వేలల్లో ఫోన్ కాల్స్.. ఆయన రెస్పాన్స్ చూస్తే..!

దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతితో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తున్నా అవి అందరికీ చేరువ కావడం లేదు. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సీజన్ కొరత ఏర్పడటంతో ఎంతో మంది కరోనా పేషేంట్స్ మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ మరోసారి సోనూ సూద్ గుర్తొచ్చి సాయం కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. గతేడాది కరోనా విలయతాండవం చేస్తున్న కల్లోల పరిస్థితుల్లో అందించిన సేవలు మరువలేనివి. కరోనా మహమ్మారి దాడితో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద పడ్డ సమయంలో అందరినీ దేవుడిలా ఆదుకున్నారు సోనూ సూద్. చేతిలో పని లేక, జేబులో చిల్లిగవ్వ లేక కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూ సూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంతోమంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో ఇళ్లకు చేర్చారు సోనూ సూద్. అంతేకాదు ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది ఆకలి బాధను తీర్చారు. రైతులకు, పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఇంకా ఇలాంటి ఎన్నో సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటానని చెప్పారు. దీంతో తాజాగా నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నడుమ వేలాది మంది ఆయనను సాయం ఆర్జిస్తున్నారట. హాస్పిటల్ బెడ్స్, కరోనా మెడిసిన్, ఇంజెక్షన్ల కోసం దేశ నలుమూలల నుంచి ఆయనకు వేలల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ ట్వీట్ చేసిన సోనూ సూద్.. ఇంతటి నిస్సహాయ స్థితి వస్తుందని ఊహించలేదని, పరిస్థితి చూస్తుంటే చాలా భయానకంగా కనిపిస్తోందని అన్నారు. అందరూ ఇంట్లోనే ఉండి, మాస్క్ ధరిస్తూ కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి అని సోనూ సూద్ పేర్కొన్నారు. సాయం అందించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను కానీ ఈ పరిస్థితుల్లో నా ఒక్కడి సాయం సరిపోదు.. దయచేసి అందరూ కలిసిరండి.. కలసికట్టుగా అవసరమున్న ప్రతి ఒక్కరికీ సాయం అందిద్దాం అని సోనూ సూద్ అన్నారు.


from https://ift.tt/3x6duzc

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages