ఓర్నాయనో.. కత్తర్ పాపకి సినిమా ఛాన్స్.. ఇక బూతులు మాట్లాడను.. ఎక్స్ పోజింగ్ చేయనంటూ వీడియో - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 12 April 2021

ఓర్నాయనో.. కత్తర్ పాపకి సినిమా ఛాన్స్.. ఇక బూతులు మాట్లాడను.. ఎక్స్ పోజింగ్ చేయనంటూ వీడియో

టిక్ టాక్ యాప్‌తో పాపులర్ అయిన వాళ్లలో అలియాస్ షాలిని ఒకరు. అయితే మిగిలిన టిక్ టాక్ స్టార్స్ ఓ లెక్క.. ఈ మాత్రం మరోలెక్క. ఆమె అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కొంతమంది ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాపై అవగాహన లేని షాలినిని లైవ్‌లో కావాలనే రెచ్చగొట్టి.. ఆమెతో పచ్చి బూతులు మాట్లాడేట్టు చేసి.. ఆ వీడియోలను వైరల్ చేశారు. ఆ తరువాత క్రమేపీ ఈమెకు టిక్ టాక్‌లో ఫాలోవర్స్ పెరగడంతో ఆమె కూడా కావాలని వీడియోలు చేస్తూ పచ్చిబూతులతో రెచ్చిపోయేది. ఈమెకు సంబంధించి కొన్ని వీడియోలు పోర్న్ సైట్స్‌లో కూడా దర్శనం ఇస్తున్నాయి. అయితే తనను కావాలనే కొంతమంది ఇలా చేశారని అమాయకంగా చెప్తున్న షాలిని.. ఇకపై బూతులు.. ఎక్స్ పోజింగ్ వీడియోలు చేయనని చెప్పింది. అంతేకాదు.. తనకు సినిమా ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నా పేరు షాలిని బుజ్జీ.. ఆంధ్రాపాప లేదు.. కత్తర్ పాప లేదు.. తొక్క పాప లేదు.. నాకు సినిమాలో అవకాశం వచ్చింది అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టేశా.. రెండు ఐటమ్ సాంగ్స్ కూడా ఇచ్చారు. ఆ సినిమా వల్ల నాకు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఈరోజు నుంచి నేను ఎవర్నీ బూతులు తిట్టను.. ఎక్స్ పోజింగ్ వీడియోలు చేయను.. నా పని నేను చూసుకుంటా. నేను చేస్తున్న సినిమా జనవరిలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక నుంచి కొత్త కనిపిస్తాను.. మంచి పేరు తెచ్చుకుంటాను.. నేనేంటో చూపిస్తాను. నన్నెవరు తిట్టుకున్నా... నన్ను చూసి కుళ్లుకున్నా నేను పట్టించుకోను. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తాను నటించబోయే సినిమాలో డైలాగ్ కూడా చెప్పేసింది కత్తర్ పాప షాలిని. ‘నా హైటూ వెయిటూ చూసి ముందుకు రాకు.. నన్ను కాటేస్తే’ అని డైలాగ్ మధ్యలోనే ఆపేసి.. మిగతాది సినిమాలో చూడండని అంటుంది. ఇంతకీ ఏమి సినిమా? ఎవరితో ఎప్పుడు అనే విషయాలు మాత్రం చెప్పలేదు. మరి ఈమె చెప్పింది నిజమేనా?? లేక ఇది కూడా ఆమె ప్రమోషనల్ ట్రిక్స్‌నా అన్నది త్వరలో తేలనుంది.


from https://ift.tt/3s9czdp

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages