తన కుమార్తె వ్యక్తిత్వంపై అభిషేక్ కామెంట్.. భార్య ఐశ్వర్యనే కారణమంటూ ఓపెన్!! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 12 April 2021

తన కుమార్తె వ్యక్తిత్వంపై అభిషేక్ కామెంట్.. భార్య ఐశ్వర్యనే కారణమంటూ ఓపెన్!!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల ముద్దుల మనవరాలు.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్. స్టార్ ఫ్యామిలీలో పుట్టిన ఆరాధ్య చిన్న వయస్సులోనే సెలబ్రిటీ స్టేటస్‌ సంపాదించుకుంది. తన తల్లితో పాటు పలు ఫ్యాషన్‌ షోలలో, ఈవెంట్‌లలో పాల్గొని.. ఫోటోలకు పోజులు ఇస్తుంటుంది ఈ చిన్నారి. ఐశ్వర్య, ఆరాధ్యలు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే స్టార్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ.. తన కుమార్తె ఆరాధ్యకు ఎటువంటి గర్వం ఉండదని.. తండ్రి తెలిపాడు. అభిషేక్ నటించి ‘’ అనే చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. కూకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభిషేక్‌తో పాటు ఇలియానా, నికితా దత్తా, సోహమ్ షా, రామ్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్ ఎఫ్ఎఫ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో అభిషేక్ తన భార్య, కుమార్తెలను ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘ఆరాధ్య ఇంకా చిన్న పిల్లనే. ప్రస్తుతం ఆమె ఆన్‌లైన్ క్లాసులతో బిజీగా ఉంది. ఆరాధ్య గురించి నేను ఎక్కువగా పట్టించుకోను. అది పూర్తిగా ఐశ్వర్య డిపార్ట్‌మెంటే. తను(ఆరాధ్య) ఎలాంటి కుటంబంలో జన్మించిందో తనకి తెలుసు. తాత, నాయనమ్మ, అమ్మ, నాన్న అందరూ యాక్టర్లే అనే అవగాహన ఉంది. ఇలాంటి కుటుంబంలో పుట్టడం తను ఎంతో గొప్పగా భావిస్తుంది. అది కాక.. తను చాలా సాదాసీదాగా ఉంటుంది. మా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంది. ఇతరులను గౌరవిస్తుంది. తన తల్లి ఆరాధ్యను ఎంతో పద్దతిగా పెంచింది. అందుకు ఆమెను అభినందించాలి. ఆరాధ్య ఏమాత్రం గర్వం లేకుండా ఉందంటే అందుకు కారణం ఐశ్వర్యనే.. ఆది ఆమె గొప్పతనమే’’ అని అభిషేక్ అన్నాడు.


from https://ift.tt/3d7Zmxi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages