థియేటర్లలో కుమ్మేస్తున్న వకీల్ సాబ్.. పవన్ సొంతమైన బిగ్గెస్ట్ ఫీట్.. లాక్‌డౌన్ తర్వాత తొలి సినిమా! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 14 April 2021

థియేటర్లలో కుమ్మేస్తున్న వకీల్ సాబ్.. పవన్ సొంతమైన బిగ్గెస్ట్ ఫీట్.. లాక్‌డౌన్ తర్వాత తొలి సినిమా!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద 'వకీల్ సాబ్' హంగామా కనిపిస్తోంది. కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ మూవీకి పట్టం కడుతున్నారు ఆడియన్స్. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ చేసేందుకు థియేటర్లకు చేరుకుంటున్నారు. దీంతో 5వ రోజు సైతం అన్ని సెంటర్ల వద్ద జనం సందడి కనిపించింది. ఏప్రిల్ 9న సినిమా హాల్స్‌లో దిగిన వకీల్ సాబ్ కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ సరికొత్త ఫీట్స్ అందుకుంటున్నారు. విడుదలైన తొలి షోతోనే సక్సెస్ టాక్ అందుకున్న 'వకీల్ సాబ్' మూవీ వరుసగా 5 రోజులపాటు సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించింది. నిన్న ఉగాది సెలవు దినం కావడంతో కలెక్షన్స్ పుంజుకున్నాయి. చాలా ఏరియాల్లో సాలీడ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేవలం ఆడియన్స్ మౌత్ టాక్ సినిమాకు ప్రధాన బలంగా మారింది. సామాజిక కోణంలో రూపొందిన ఈ మూవీ చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తుతున్నారు. క్లాస్, మాస్ తేడాలేకుండా B, C సెంటర్లలోనూ వకీల్ సాబ్ జోష్ కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన వకీల్ సాబ్ మూవీ మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వచ్చేసింది. కలెక్షన్స్ వరద పారిస్తూ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. లాక్‌డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్‌లో మరెన్నో రికార్డ్స్ చెరిపేయడం ఖాయం అనిపిస్తోందని ట్రేడ్ పండితులు అంటున్నారు. నిజానికి రీమేక్ సినిమా అయినా వేణు శ్రీరామ్ కథను మలిచిన విధానం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ పోటాపోటీ నటన సినిమాలు ప్లస్ అయింది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగేళ్ల పర్‌ఫార్‌మెన్స్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.


from https://ift.tt/3thL6HU

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages