Love Story: వైరల్ అవుతున్న నాగ చైతన్య లుంగీ లుక్.. భర్తపై సమంత కామెంట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 23 November 2020

Love Story: వైరల్ అవుతున్న నాగ చైతన్య లుంగీ లుక్.. భర్తపై సమంత కామెంట్

నేడు (నవంబర్ 23) అక్కినేని 34వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో లుంగీ కట్టి అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నారు చైతూ. అయితే ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్న సమంత.. భర్త నాగ చైతన్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ''ఎల్లప్పుడూ నీ సొంత ఆలోచనలతో ఇలాగే ముందుకెళ్లు.. నీకు నచ్చినట్లుగా హాయిగా జీవించు'' అని పేర్కొన్నారు. సమంత చేసిన ఈ ట్వీట్ చూసి సూపర్ అంటూ నాగ చైతన్యకు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ '' సినిమాలో చైతూ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది కానీ థియేటర్స్ రీ ఓపెన్ కాకపోవడంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: ఇక ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే.. ఆయన లుంగీ, బనియన్ మీద కనిపిస్తున్నారు. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.


from https://ift.tt/3kZfnWS

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages