వివాదంలో ‘రౌడీ బేబీ’ సాంగ్... ఏకిపారేస్తున్న నెటిజన్లు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 19 November 2020

వివాదంలో ‘రౌడీ బేబీ’ సాంగ్... ఏకిపారేస్తున్న నెటిజన్లు

ధనుష్, సాయిపల్లవి కలిసి నటించిన ‘మారి 2’ సినిమాలోని ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవలే యూట్యూబ్‌లో ఏకంగా 100కోట్ల వ్యూస్ సాధించి సత్తా చాటింది. సౌతిండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి పాటగా రికార్డు నెలకొల్పింది. దీంతో నెటిజన్లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకుంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ కామన్‌ డీపీని షేర్‌ చేసింది. అదే ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ నెటిజన్లు వారిని ఏకిపారేస్తున్నారు. ఇంతకీ అక్షరాలు తప్పుపడ్డాయనో.. తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారనో కాదు ఈ వివాదం.. పోస్టర్‌లో కేవలం ఫోటోనే మాత్రమే చూపించడమే వివాదానికి దారితీసింది. ఈ పాట్ అంత పెద్ద హిట్ అవ్వడానికి మ్యూజిక్ కంటే డ్యాన్సే కీలకమైంది. ప్రభుదేవా కొరియాగ్రఫీ చేసిన ఈ పాటలో ధనుష్ కంటే సాయిపల్లవే స్టెప్పులు ఇరగదీసింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయిపల్లవి ఇందులో వేసిన స్టెప్పుల వల్లే ఈ సాంగ్ అంతలా ఆకట్టుకోవడానికి కారణమని అందరికీ తెలుసు. అయితే పోస్టర్లో మాత్రం ఆమె ఫోటో వేయకపోవడం అందరినీ నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో సాయిపల్లవి అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సీరియస్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. సాయిపల్లవి అంటే అందరికీ భయం పట్టుకుందని, ఇండస్ట్రీలో ఆమెను అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదీ ఓ మార్గమని ఏకిపారేస్తున్నారు. ఈ విమర్శలపై నిర్మాణ సంస్థ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. Also Read:


from https://ift.tt/3pKQ7HC

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages