విలన్‌గా మారిన డైరెక్టర్‌తో విజయ్ 65వ సినిమా!.. ఫ్యాన్స్ ఖుషీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 19 November 2020

విలన్‌గా మారిన డైరెక్టర్‌తో విజయ్ 65వ సినిమా!.. ఫ్యాన్స్ ఖుషీ

కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘మాస్టర్’ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇది విజయ్‌కి 64వ సినిమా. దీని తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్నది ఆసక్తిగా మారింది. 65వ సినిమా ఏఆర్ మురుగదాస్‌తో చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. Also Read: దీంతో విజయ్‌తో సినిమా చేసేందుకు ప్రముఖ దర్శకులు.. పేరరసు, మగిళ్‌ తిరుమేని, నెల్సన్‌, మోహన్‌రాజా, హరి పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిలో పేరరసుకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ టాక్. మరోవైపు ప్రముఖ డైరెక్టర్ ఇటీవల విజయ్‌ని కలిసి కథ వినిపించినట్లు సమాచారం. లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌ అంశాలు కలబోసిన ఆ కథ విజయ్‌కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఎస్‌జే సూర్య, విజయ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఖుషీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే అదే మ్యాజిక్ రిపీట్ ఖాయమని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌తో ఖుషీ, కొమరం పులి వంటి సినిమాలు తెరకెక్కించిన ఎస్‌జే సూర్య తమిళంలోనూ అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత డైరెక్షన్ పక్కనపెట్టి విలన్‌గా మారాడు. స్పైడర్, అదిరింది.. వంటి సినిమాల్లో ఆయన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది.


from https://ift.tt/3m0lw6o

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages