డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి అనతికాలంలోనే టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు . ఓ సినిమాపై ఆయన వేసిన అంచనా, తీసుకునే నిర్ణయానికి తిరుగే ఉండదని పలుసార్లు నిరూపితమైంది కూడా. ఈ క్రమంలోనే రీసెంట్‌గా నాని హీరోగా వచ్చిన V సినిమాను డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్‌పై రిలీజ్ చేసి లాభాలు గడించిన దిల్ రాజు.. తాజాగా హీరోగా రూపొందుతున్న వకీల్ సాబ్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారట. తన సినిమాకే కాదు థియేటర్లకు కూడా మేలుకలిగేలా డిసీజన్ తీసుకున్నారట దిల్ రాజు. రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ బంద్ కావడం, థియేటర్స్ మూతపడటం లాంటి కారణాల వల్ల ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వకీల్ సాబ్ మూవీ కోసం భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించారట దిల్ రాజు. Also Read: వకీల్ సాబ్ చిత్రం ఓటీటీ హక్కుల కోసం దిల్ రాజుకు 80 కోట్ల రూపాయల ఆఫర్ హ్యూజ్ ఆఫర్ వచ్చినప్పటికీ దిల్ రాజు వద్దనుకున్నారట. 100 కోట్లు ఆఫరిచ్చినా గానీ వకీల్ సాబ్‌ను ఓటీటీ రిలీజ్ చేయనని మొహమాటం లేకుండా చెప్పేశారట. థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక జనాన్ని థియేటర్‌కి రప్పించడంలో వకీల్ సాబ్ కీలక పాత్ర పోషించాలని ఫిక్స్ అయిన దిల్ రాజు.. ఈ సినిమాను డైరెక్టుగా థియేటర్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారట. అందుకే ఆయన ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.
from https://ift.tt/2RFp3cR
No comments:
Post a Comment