గాన గంధర్వుడు అంతిమ సంస్కారాలు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చేతుల మీదుగా పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఎంతోమంది సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితులు, రాజకీయ నాయకులు హాజరై కన్నీటి నివాళులు అర్పించారు. తమిళ స్టార్ హీరో విజయ్ బాలుకు నివాళులర్పిస్తూ చలించిపోయారు. భారతీరాజా, దేవి శ్రీ ప్రసాద్, మనో తదితరులు బాలును కడసారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరాధ్య సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అంతిమ క్రతువు నిర్వహించారు. గాన గంధర్వునికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు పోటెత్తారు. కరోనాతో పోరాడి గెలిచినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి గురై నిన్న (సెప్టెంబర్ 25) తిరిగిరాని లోకాలకు వెళ్లారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. దశాబ్దాల జర్నీలో 40 వేల పాటలు పాడి తన గానామృతంతో సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన బాలు.. ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. మరోవైపు సినీ ప్రముఖులంతా బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. Also Read: S.P బాలు ప్రయాణంలో ఎన్నో మైలురాలున్నాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. 1979, 1981,1983,1988, 1995,1996లో మొత్తం ఆరుసార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఆయన గిన్నీస్ బుక్ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు.
from https://ift.tt/334kXlh
No comments:
Post a Comment