Ravi Teja: హాట్ బ్యూటీతో రవితేజ రొమాన్స్.. భలే ఛాన్సులే! డైరెక్టర్ ఫిక్సయ్యారిలా.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 20 September 2020

Ravi Teja: హాట్ బ్యూటీతో రవితేజ రొమాన్స్.. భలే ఛాన్సులే! డైరెక్టర్ ఫిక్సయ్యారిలా..

వరుస సినిమాలతో మంచి జోష్‌లో మాస్ మహారాజ్ మరొకొన్ని ఇంట్రెస్టింగ్ కథలను ఓకే చేశారని తెలుస్తోంది. అందులో ఒకటి రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఖిలాడీ'. ఈ మూవీలో హీరో రెండు వెరైటీ పాత్రలు పోషిస్తూ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. అందుకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందట. ఈ క్రమంలో ఇప్పటికే హాట్ బ్యూటీలు రాశీ ఖన్నా, నిధి అగర్వాల్ పేర్లు బయటకురాగా.. తాజాగా మరో గ్లామర్ గర్ల్ పేరు చెక్కర్లు కొడుతోంది. `రన్ రాజా రన్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాల్లో హాట్ హాట్ పాత్రల్లో మెరిసిన సీరత్ కపూర్.. ఖిలాడీ రవితేజతో రొమాన్స్ చేయనుందని అంటున్నారు. ఈ మేరకు డైరెక్టర్ రమేష్ వర్మ ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ మేనరిజానికి సూటయ్యేలా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ రెడీ అవుతోందని టాక్. రవితేజ, సీరత్ కలిసి గతంలో `టచ్ చేసి చూడు` సినిమాలో నటించారు. Also Read: మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.


from https://ift.tt/2ZVASAh

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages