Naga Babu: కోట్లు సంపాదించడం ఎలా? సో ఈజీ.. ఇలా ప్లాన్ చేయండి.. లాజిక్ చెప్పేసిన నాగబాబు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 20 September 2020

Naga Babu: కోట్లు సంపాదించడం ఎలా? సో ఈజీ.. ఇలా ప్లాన్ చేయండి.. లాజిక్ చెప్పేసిన నాగబాబు

రోజురోజుకూ సోషల్ మీడియా హవా బాగా పెరిగిపోతోంది. దీంతో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు సైతం సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని ఈ సిచువేషన్ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాబ్రదర్ 'మన ఛానల్.. మన ఇష్టం' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ? డబ్బు సంపాదించే అర్హత లేనివాళ్లు ఎవరు? అనే దానిపై రియాక్ట్ అయ్యారు మెగా బ్రదర్. నాగబాబు మాట్లాడుతూ.. ''ఉదాహరణకు లేజీ పీపుల్.. ఈ లేజీ పీపుల్‌కి డబ్బు సంపాదించే అర్హత లేదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్ళకి డబ్బు సంపాదించడం చేతకాదు. ఒకవేళ ఈ లేజీ పీపుల్ ఏదన్నా వ్యాపారం చేసినా చాలా తొందరగా నష్టపోతారు. ఎందుకంటే వ్యాపారం చేసేటపుడు పనిమీద ఫోకస్ ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు.. సోమరితనం ఏం చేస్తుందంటే వాళ్ళని ఏదో తెల్లారి 9 టు 5 జాబ్ చేసుకొని వెళ్ళామా? లేదా అంతవరకే ఆలోచింపజేస్తుంది తప్ప ఆ ఉద్యోగంలో పైకి ఎలా వెళ్లొచ్చనే దాని గురించి ఆలోచించనీయదు. ఇక తాతముత్తాతలు ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ హాయిగా రోడ్లపై తిరుగుతూ ఎంజాయ్ చేసే వాళ్ళు కొందరుంటారు. వాళ్ళ వల్ల సమాజానికి గానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. సో.. డబ్బు సంపాదించాలని అనుకుంటున్న వారికి మొదట ఉండకూడని లక్షణం సోమరితనం. Also Read: అన్ని ఇండీస్ట్రీల్లో ఉన్నట్టే మా ఇండస్ట్రీలో కొందరు ఆల్కహాల్ హాబిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా చిన్న ఆర్టిస్టు.. ఒక టీవీ స్టాండర్డ్ ఉన్న ఆర్టిస్టు డైలీ రెండు పెగ్గులు తాగుతానని నాతో చెబుతూ అంతకంటే ఇంకా లైఫ్ ఏముంటుందని అన్నాడు. నేను షాకయ్యా. కానీ అతను ఇప్పటికీ ఏం సంపాదించలేదు. దురలవాట్ల వల్ల అతను ఏమీ నష్టపోకపోవచ్చు గానీ పైకి రాలేదు. ఇలాంటి దురలవాట్లు ఉన్నవారికి కూడా ఎప్పటికీ డబ్బు సంపాదించే అర్హత లేదు. ఎవడో కోట్లలో ఒకడు మాత్రమే దురలవాట్లు ఉండి కూడా సక్సెస్ అవుతాడు. అలాగని వాడిని ఉదాహరణగా తీసుకోకండి. Also Read: ఇక క్రమశిక్షణ లేనోళ్లకి కూడా డబ్బు సంపాదించే అర్హత లేదు. మన లైఫ్‌ని చాలా ప్రణాళికా బద్దంగా మార్చుకోవాలి. మా చిన్నప్పుడు డబ్బులొస్తే మా అమ్మ గానీ, నానమ్మ గానీ చాలా క్రమశిక్షణగా మెదిలేవారు. అలా ప్లాన్‌గా లేనివాళ్ళని డబ్బులు సంపాదించడం కుదరదు. ఇక నిజాయితీ లేనివాళ్లకు కూడా డబ్బు సంపాదించే అర్హత లేదు. నిజాయితీగా ఉంటే ఎన్నటికైనా నిలబడవచ్చు. టాలెంట్‌లో పని లేకుండా నిజాయితీగా ఉండి డబ్బు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో.. మీరు గనక డబ్బు సంపాదించాలంటే చేయాల్సినవి. సోమరితనాన్ని వదిలేయాలి. క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. మంచి ఆరోగ్యం సంపాదించుకోవాలి. ప్రతి విషయంలోనూ వెల్ ప్లానింగ్ గా ఉండాలి. అలాగే దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇక ఎవ్వరినీ మోసం చేయకుండా నిజాయితీ మెలగాలి. ఈ ఆరు లక్షణాలు మన దగ్గర ఉంటే డబ్బు సంపాదించడానికి అన్ని అర్హతలు ఉన్నట్టే'' అని చెప్పారు.


from https://ift.tt/3hLdvQ9

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages