తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమే అన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్. తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్వెన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని.. ఆ పదేళ్ల టైంలో చాలా కోల్పోయని, రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు మురళీ మోహన్. ఆయన మాట్లాడుతూ.. ‘గత పదేళ్లు నేను రాజకీయంల్లో ఉండటం వల్ల.. జనం నన్ను పొలిటీషియన్‌గా మాత్రమే చూస్తున్నారు. అంతకు ముందు చాలా ఏళ్లు సినిమా నటుడుగా ఉన్నప్పటికీ.. టీడీపీ ఎంపీగా ఉండటం వల్ల.. ఈయన ఇక్కడ ఉండడు.. ఢిల్లీలో ఉంటాడు.. అమరావతిలో ఉంటాడని నా దగ్గరకు ఎవరూ రావడం లేదు. నేను ఈ రాజకీయాలను వదిలేసి ఇక సినిమాలు మాత్రమే పనిచేస్తానని అన్నా కూడా.. నిర్మాతలు నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. నేను ఇంకా పాలిటిక్స్‌లోనే ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. నేను నూటికి నూరు శాతం రాజకీయాలను వదిలేశాడు.. పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేశా. ఎందుకంటే.. నాకు బ్రహ్మాండమైన ఇండస్ట్రీ ఉంది.. సినిమాలు ఉన్నాయి.. హ్యాపీగా వీటిని చేసుకోకుండా.. జనంలో పడి పోటీ చేస్తే.. మన కష్టాన్ని గుర్తించి మెచ్చుకునే వాళ్లు ఉండరు. విమర్శించే వాళ్లు చాలామంది ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నాం అంటే లేనిపోనివి మనపై వేసేస్తారు. అలాంటప్పుడు నా విలువైన సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి. ఇప్పటికే రాజకీయాల్లోకి రావడం వల్ల పదేళ్లు వేస్ట్ చేసుకున్నాను.. ఇప్పుడు నాకు ఎనభై ఏళ్లు.. మహా అయితే ఇంకో పదేళ్లు యాక్టివ్‌గా ఉంటాను.. తరువాత ఎలా ఉంటానో తెలియదు. నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది పాలిటిక్స్‌లోకి రావడమే.. ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా? టీడీపీలో చేరి తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నాను. నేను రాజకీయాలు చేసినా.. చాలా నీతిగా నిజాయితీగా చేశా.. ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆశించలేదు.. నా సొంత డబ్బుల్ని ఖర్చు చేశా. అయినప్పటికీ కూడా నన్ను విమర్శల పాలు చేశారు. చివరికి నేను రాజకీయాలు వదిలేస్తున్నా అంటే కూడా విమర్శించారు. ఇప్పటివరకూ పాలిటిక్స్‌లో తిన్నదంతా కక్కి అప్పుడు పాలిటిక్స్‌కి గుడ్ బై చెప్పండి అంటున్నారు. నిజంగా నాకు డబ్బులు కావాలనుకుంటే.. నాకు వ్యాపారాలు లేవా?? సినిమాలు లేవా?? రియల్ ఎస్టేట్ లేదా?? ఇవన్నీ వదిలేసి నేను ఎందుకు వచ్చా.. నేనేదో కావాలని ఇంట్రస్ట్‌తో రాజకీయాల్లోకి రాలేదు.. ఒకప్పుడు రామారావు గారు నన్ను పాలిటిక్స్‌లోకి రమ్మని అడిగారు కాని నేను వెళ్లలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే నన్ను ఎంపీగా పోటీ చేయమని పిలిస్తే.. నేను ఆయన దగ్గరకు వెళ్లి సారీ సార్.. నేను రాలేను.. నాకు అనుభవం లేదని చెప్పాను. ఆ తరువాత చంద్రబాబు గారు వచ్చి.. మీరు గతంలో పిలిస్తే పార్టీలోకి రాలేదు.. సెటిల్ అవ్వలేదని అన్నారు.. ఇప్పుడు అన్నీ సాధించారు.. పిల్లల పెళ్లిళ్లు కూడా చేశారు. ఇప్పుడైనా పార్టీలోకి రండి అని చంద్రబాబు పిలిచారు. సారీ అండి నేను రాజకీయాల్లోకి రాలేనని చంద్రబాబుకి తెగేసి చెప్పా. కాని ఆయన అందరూ అలా అంటే ఎలా.. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు.. నిర్మాతగా ఉన్నారు.. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.. పొలిటీషియన్ ఎందుకు కాకూడదు.. మీరు రండి నేను చూసుకుంటా అన్నారు. నేను వద్దని చెప్పినా నన్ను బాగా బలవంత పెట్టి చివరికి కన్వెన్స్ చేశారు. చివరికి కిందా మీదా పడి ఓసారి గెలిచా.. ఓ సారి ఓడా.. మొన్నటి ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెప్పా. ఎన్నికల ముందు చంద్రబాబు దగ్గరకు వెళ్లి.. సార్ నేను వద్దన్నా పార్టీలోకి పిలిచారు.. దాని వల్ల చాలా నష్టపోయా. నా ఆరోగ్యం, సమయం వేస్ట్ అయ్యింది.. నా ట్రస్ట్‌ని కూడా సరిగా పట్టించుకోలేదు. చాలా డబ్బు ఇతర ఫండ్స్ నా ట్రస్ట్‌కి పెట్టకుండా రాజకీయాల్లో ఖర్చు చేయడం వల్ల నా ట్రస్ట్ దెబ్బతిన్నది. ఇక చాలు ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను.. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం నా వల్ల కాదు. ఎనభై ఏళ్లలో ఇంకా పార్టీ కోసం పనిచేయడం నా వల్ల కాదని గుడ్ బై చెప్పి వచ్చేశా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . కాగా మురళీమోహన్.. 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు. తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉండటమే కాకుండా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
from https://ift.tt/3ko39qZ
No comments:
Post a Comment