ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడి థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాకే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు మొదట భావించారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇటీవల నాని ‘V’ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. అందుకే, ఇక థియేటర్ రిలీజ్ కోసం వేచిచూడకుండా ‘నిశ్శబ్దం’ను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్‌ను సైతం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర విడుదల తేదీని శుక్రవారం అమెజాన్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రసారం కానున్నట్టు అమెజాన్ వెల్లడించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘నిశ్శబ్దం’లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా అనుష్క కనిపించనుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు అయిన ఆమె భర్త, అలాగే ఆమె ప్రాణ స్నేహితురాలు అదృశ్యం కావడం అనే అంశంపై ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా అరంగేట్రం చేస్తున్నారు. Also Read: చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటివరకు పోషించిన అన్ని పాత్రలతో పోలిస్తే సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర ఇది. ఇలాంటి పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. మాధవన్‌తో మళ్లీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. థ్రిల్లర్ మూవీస్ అంటే తనకు చాలా ఇష్టమని, ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని మాధవన్ చెప్పారు.
from https://ift.tt/2ZNBlVe
No comments:
Post a Comment