దిగ్గజ గాయకుడు, గానగంధర్వుడు ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటలుగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఆయనకి ఎక్మో, ఇతర లైఫ్ సపోర్ట్‌పై చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ పేర్కొంది. తమ నిపుణుల బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఎస్పీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలసుబ్రహ్మణ్యం కోసం భగవంతుడిని ప్రార్థించాలని, ఈ సమయంలో అందరి ప్రార్థనలు ఆయనకు అవసరమైని, బాలు త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకుడు ఎస్.తమన్ ట్వీట్ చేశారు. ఎంజీఎం హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయడానికి ముందే తమన్ ఈ ట్వీట్ చేశారు. బాలు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ ఆయన ఊపిరితిత్తుల పనితీరు బాగాలేదని సమాచారం. నాన్న కోలుకుంటున్నారని, ఆహారం కూడా తీసుకుంటున్నారని ఈ మధ్యే ఎస్పీ చరణ్ వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. ఇంతలోనే మళ్లీ ఎస్పీబీ ఆరోగ్యం విషమించడం బాధాకరం. కరోనా నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు బాలుని చుట్టిముట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు కూడా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందుతున్నట్టు సమాచారం. కాగా, తమన్ చేసిన ట్వీట్ చూసి బాలు ఫ్యాన్స్ మరింత ఆందోళనకు గురవుతున్నారు. Also Read:
from https://ift.tt/301hz8z
No comments:
Post a Comment