పెళ్లాం బండబూతులు తిడితే!! బుర్ర తక్కువ వాళ్ళనుకుంటాం గానీ.. కళ్లు తెరిపించిన పూరి జగన్నాథ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 18 September 2020

పెళ్లాం బండబూతులు తిడితే!! బుర్ర తక్కువ వాళ్ళనుకుంటాం గానీ.. కళ్లు తెరిపించిన పూరి జగన్నాథ్

లాక్‌డౌన్ వేళ షూటింగ్స్ లేక ఖాళీగా ఇంట్లోనే ఉంటున్న రోజుకో కొత్త మ్యాటర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సమాజం, వ్యక్తుల మధ్య సంబంధాలు, శృంగారం, మోటివేషన్ తదితర అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'సెన్సాఫ్ హ్యూమర్' అనే టాపిక్ ఎంచుకొని ఓ వ్యక్తి ఎలా నడుచుకుంటే గొప్పవాడు అవుతాడనేది ఉదాహరణలతో సహా వివరించాడు. ఉండాలేగానీ ఎటువంటి రోగాలు రావని, హాయిగా హెల్దీగా జీవించొచ్చని పేర్కొన్నారు. ''సెన్సాఫ్ హ్యూమర్.. ఇట్స్ యాజ్‌ ఎబిలిటీ టు ఫైండ్‌ థింగ్స్ ఫన్నీ. సెన్సాఫ్ హ్యూమర్ మీలో ఉండాలంటే.. మీకు కొంచెం డిటాచ్‌డ్ మెండ్ ఉండాలి. మీరు మరీ ఈగోయిస్టిక్ అయితే కుదరదు. మీ మీద మీరు జోకులేసుకునేంత కెపాసిటీ మీకు ఉండాలి. అప్పుడే మజా. ఇండియాలో అందరికీ సర్ధార్‌జీ అంటే డేడ్‌థిమాక్ అని ఫీలింగ్. మనందరం సర్ధార్‌జీ అంటే బారాభజే గాళ్ళని, బుర్ర తక్కువ వాళ్ళని ఫిక్సయ్యాం. నో.. వాళ్లు చాలా చాలా ముదుర్లు. వాళ్ల మీద వాళ్లే జోక్స్ వేసుకుంటూ మనల్ని నవ్విస్తుంటారు. కాబట్టి మనం అలా అనుకుంటాం. ఎదుటివాడిని జీనియస్‌లాగా, వాళ్లేమో ఫూల్స్‌లాగా కలరింగ్‌ ఇస్తూ హోల్ కంట్రీని నమ్మించారు. సర్దార్‌జీస్‌ ఆర్ డబుల్‌ ఇస్మార్ట్. Also Read: ఖుష్‌వన్ సింగ్‌ అని ఓ పెద్దాయన ఉండేవాడు. సర్ధార్‌జీల మీద ఆయన వేసిన జోకులు ఎవరూ వేయలేరు. సాంతా, బంటా అంటే మనం ఫూల్స్ అనుకోవద్దు. మనల్ని నవ్వించడానికి వాళ్లు క్రియేట్‌ చేసిన క్యారెక్టర్లు అవి. అందుకే సర్దార్ జీలను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. సెన్సాఫ్ హ్యూమర్ అనేది లీడర్‌షిప్ క్వాలిటీ. అడుక్కునే సర్ధార్‌ని ఎప్పుడైనా చూశారా? నెవ్వర్.. వాళ్లు ఎక్కడున్నా హాయిగా బతికేయగలరు. వారి ప్లస్ పాయింటే సెన్సాఫ్ హ్యూమర్. జోక్స్ ప్రాక్టీస్ చేయండి. అందరినీ నవ్వించండి. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే అందరూ మీకే అట్రాక్ట్ అవుతారు. దానివల్ల మీ గ్రోత్ మారుతుంది. తెలియకుండానే మీరు లీడర్స్ అవుతారు. గ్రేట్‌ లీడర్స్‌ని పరిశీలించండి. వారిలో లాటాఫ్ హ్యూమర్ ఉంటుంది. సరదాగా పిట్టకథ చెబుతూ పెద్ద ఫిలాసఫీ చెప్పేస్తారు. చాలా హర్టింగ్‌గా ఉండే విషయాలు కూడా ఫన్నీ వేలో చెప్పొచ్చు. దీనివల్ల బ్లడ్‌ సర్క్యూలేషన్ అదుపులో ఉండి.. మెంటల్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్ బాగుంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థం చేసుకోగలరు. Also Read: మీ మీద మీరే జోకులేసుకుంటూ.. ఇంత వయసొచ్చినా ఇంకా తప్పులు చేస్తున్నావా గురూ! నాకు ఇంకెప్పుడు బుద్ది వస్తది అని అనండి. మీ చుట్టూ ఉన్న వాళ్లంతా నవ్వేస్తారు. లేకపోతే దానిని పెద్ద మిస్టేక్‌లా ప్రొజెక్ట్ చేస్తూ మీ బాస్‌కి కంప్లయింట్‌ చేస్తారు. సెన్సాఫ్ హ్యూమర్ వల్ల మీ క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. కష్టాల్లో ఈజీగా బయటపడతారు. పెయిన్‌, యాంగర్ మీ చుట్టుపక్కలకు రావు. సెన్సాఫ్ హ్యూమర్ లేని వాళ్లే ఎక్కువ ఏడుస్తారు. చొక్కాలు చింపుకుంటారు. సోషల్‌ మీడియాలో యాంగ్రీ పోస్ట్‌లు పెడుతుంటారు. Also Read: మీలో గనక సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే తల్లిదండ్రుల తిట్లు కూడా సరదాగా అనిపిస్తాయి. పెళ్ళాం బండబూతులు తిట్టినా నవ్వుతూ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. కోపంలో ఉన్న మీ బాస్‌ని నవ్వుతూ క్షమించమని అడగండి.. మీరే అతనికి ఫేవరెట్‌ ఎంప్లాయ్‌ అయిపోతారు. నేను ఫూల్‌ని అని ప్రాజెక్ట్ చేసుకోండి. అందరికీ మీరు లవబుల్‌ అయిపోతారు. అదే నేను జీనియస్‌ని అని చెప్పండి.. చుట్టుపక్కల ఉన్నవారందరికీ ఎక్కడో కాలుతుంది. చేసే సహాయం కూడా చేయరు. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే ఏ జబ్బులూ రావు. అందుకే దాన్ని డెవలప్ చేసుకోవాలి'' అని చెప్పారు పూరి జగన్నాథ్.


from https://ift.tt/2H88gNC

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages