నా సినిమాను చిరంజీవి చూడలేదు.. అదే నా బాధ: హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 23 September 2020

నా సినిమాను చిరంజీవి చూడలేదు.. అదే నా బాధ: హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు

‘‘నాకు మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుంచీ భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజినీరింగ్ అర్హత‌తో జాబ్ చేసిన తర్వాత న‌ట‌నలో శిక్షణ పొంది ఆఫర్ అందుకున్నాను’’ అని తెలిపారు హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు. సెప్టెంబర్ 24న తన పుట్టినరోజు సందర్భంగా ఈ యువ‌ హీరో తన కెరీర్ గురించి చెప్పిన ముచ్చట్లు ఇవి.. ✦ తొలి ప్రయ‌త్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే విషయాలపై అవగాహన వచ్చింది. దర్శకుడు శ్రీనాథ్ పులకురం నాన్నగారిని క‌లిసి క‌థ వినిపించారు. తనికెళ్ల భరణి గారికి కూడా చెప్పారు. ఆయన చాలా బాగుందనడంతో నాన్నగారు, ఆయన స్నేహితులు ముందుకొచ్చి ఆ సినిమా చేశారు. ✦ నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారిని చూసే పెరిగాను. ఆయన నుంచి ఎప్పుడూ ఎక్కువగా ఇన్స్‌పైర్ అయ్యేది ఫైట్స్, డ్యాన్స్ విషయంలోనే. నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌కు కానీ, జిమ్నాస్టిక్స్‌కు కానీ ఈ కథ సూట్ అవుతుందనిపించి చేశాను. ✦ ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ మూవీని నా అభిమాన హీరో చిరంజీవి ఇంకా చూడ‌లేదు. ఆయన వరకు ఇంకా రీచ్ అవలేదని బాధ పడుతున్నా. ఏదో ఒక రోజు నేను ఆయన ఆశీస్సులు అందుకోవాలి. ఆయన చేతుల మీదుగా ఏదో ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలనే కోరిక. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్. అందుకోసం ఎంతైనా కష్టపడతా. ✦ సినిమాలు అటుంచితే నాన్నగారికి సేవాకార్యక్రమాల్లో నేను కూడా సాయ‌ప‌డుతుంటాను. సాటివారికి అన్నం పెట్టాల‌ని, ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకోవాల‌ని అనుకునే నాన్నగారు నాకు స్ఫూర్తి. రాళ్లపల్లి గారి నుంచి నాన్నగారికి ఆ అలవాటు వచ్చింది. తనికెళ్ల భరణి గారు, బ్రహ్మానందం గారు, ‘మా’ అధ్యక్షులు నరేష్ గారు.. వీరంతా ఒక టీమ్‌గా చాలామందికి సాయం చేస్తుంటారు. నేను ఎన్నోసార్లు చూశాను. ✦ నాన్నగారికి తెలియ‌కుండానే స‌త్యానంద్ వ‌ద్ద న‌ట‌నలో శిక్షణ తీసుకున్నా. ఆ త‌ర్వాత ఆడిష‌న్స్‌లో సెల‌క్టయ్యాను. అలాగే ద‌ర్శకుల్లో సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. తర్వాత కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, రాజమౌళి, హ‌రీష్ శంక‌ర్ అంటే చాలా ఇష్టం. Also Read:


from https://ift.tt/3hQnKCE

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages