నా బట్టలు మరీ కనిపించేలా ఉన్నాయా? అమ్మాయిలకే ఎందుకీ బాధలు.. లేడీస్ ట్రబుల్స్‌పై సమంత కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 19 September 2020

నా బట్టలు మరీ కనిపించేలా ఉన్నాయా? అమ్మాయిలకే ఎందుకీ బాధలు.. లేడీస్ ట్రబుల్స్‌పై సమంత కామెంట్స్

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్, సినిమా విశేషాలు పంచుకోవడంతో పాటు ఈ సమాజంలోని ఎన్నో అంశాలపై స్పందిస్తూ ఉంటుంది అక్కినేని కోడలు . సమాజంలోని అసమానతలు, జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళా సమస్యల పరిష్కారంపై స్పందించడంలో అందరికంటే ముందే ఉండే సామ్.. తాజాగా ఓ కార్టూన్ బొమ్మ షేర్ చేస్తూ ఎలా ఉంటాయో వివరించింది. ఈ మేరకు మహిళల్లో ఆలోచనలు రేకెత్తించేలా పోస్ట్ పెట్టింది. మహిళలు ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా కొన్ని ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయని, ఎందుకిలా? మహిళలకే ఈ పరిస్థితి ఏమిటి? అంటూ సగటు మానవుడిలో ఆలోచన కలిగించే విషయాలు ప్రస్తావించింది సమంత. ''నేను అతనికి సరిపోతానా? అది నా తప్పేనేమో? నేను బరువు తగ్గాలేమో? నేను వారిని చూడటం మానేయాలి.. అప్పుడే అతనంటే నాకు ఇంట్రెస్టెంట్ లేదని అర్థమవుతుంది? నేను ఈ జాబ్‌కు సరిపోతానా? నా గురించి జనాలు ఏమనుకుంటున్నారో? నేను మాట్లాడితే వాళ్ళు నమ్ముతారా? అర్దరాత్రి నేను ఇంటికి పోలేనేమో? నా బట్టలు మరీ కనిపించేలా ఉన్నాయా? అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయని ఓ కార్టూన్ బొమ్మ ద్వారా వెల్లడించింది. Also Read: నువ్వు అందరిలాంటి దానివి కాదు.. నువ్వు నవ్వుతుంటే అందంగా ఉన్నావ్? నీ పెళ్లి ఎప్పుడు? నీ కుటుంబాన్ని ఎప్పుడు ఏర్పరుచుకుంటావ్? ఆడదానిలా ప్రవర్తించు.. ఇలా ఎన్నో కోణాల్లో నిత్యం సవాలక్ష ప్రశ్నలు ఆడవాళ్లకే ఎదురవుతుంటాయని ఓ అమ్మాయి బొమ్మ గీసి ఆవేదన చెందింది సమంత. ఈ మేరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మహిళకైనా సరే ఇవే సమస్యలు.. ఎందుకు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఈ పోస్ట్ జనాన్ని ఆలోచనలో పడేసింది. పర్ఫెక్ట్ సమంత.. బాగా అడిగారు అంటూ రియాక్ట్ అవుతున్నారు ఇది చూసిన నెటిజన్లు. Also Read: ఇకపోతే పెళ్లి తర్వాత వరుస విజయాలతో సత్తా చాటుతున్న సమంత.. బిజినెస్ రంగంలోనూ దూసుకుపోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు చిన్నపిల్లల కోసం 'ఏకం' ప్రీ స్కూల్ రెడీ చేసింది. దీంతో పాటు మహిళల దుస్తుల అమ్మకానికి సంబంధించిన ఆన్‌లైన్ స్టోర్ స్టార్ట్ చేస్తోంది. 'సాకీ' పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది సమంత.


from https://ift.tt/3hJ6izV

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages