విరహవేదన, లేనిపోని వాంఛలు.. రాత్రి పూటే అది సాధ్యం.. వైరల్ అవుతున్న పూరి జగన్నాథ్ నైట్ సబ్జెక్ట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 20 September 2020

విరహవేదన, లేనిపోని వాంఛలు.. రాత్రి పూటే అది సాధ్యం.. వైరల్ అవుతున్న పూరి జగన్నాథ్ నైట్ సబ్జెక్ట్

నిజ జీవితంలో ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను బయటపెడుతూ పోడ్ కాస్ట్ రూపంలో పలు ఆడియోలు విడుదల చేస్తున్నారు . ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం పడిలేచిన కెరటంలా ఎగిసెగిసి పడుతున్నారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులకు కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన 'నైట్‌' (రాత్రి) అనే టాపిక్‌పై మాట్లాడుతూ రాత్రి పూట చేసే పనుల గురించి వివరించారు. ''శ్రీ శ్రీగారు చెప్పారు. వేళగానీ వేళలలో, లేనిపోని వాంఛలతో.. దారి కాని దారులలో, కానరాని కాంక్షలతో.. దేని కొరకు పదే పదే దేవులాడతావ్‌.. ఆలసించి, అలమటించి పాకులాడుతావ్‌.. శ్రీనివాసరావ్‌ అని. చిన్నప్పుడు దీన్ని చదవగానే ఇది నాకోసమే ఆయన రాశారని అనుకున్నాను. లేనిపోని వాంఛలు.. ప్రతి రాత్రీ నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆలోచనలు ఆగేవి కాదు. ఏం పీకుతామో తెలియదు కానీ మనందరికీ ఇలాగే నిద్రలు పట్టవు. కానీ ఇంటిలిజెంట్‌ పీపుల్‌ అందరూ ఇలాగే ఎక్కువ సేపు రాత్రి పూట మేల్కొని ఉంటారని సర్వేలో తేలింది. హమ్మయ్యా.. అయితే మనం కూడా ఇంటిలిజెంటే అని చిన్న శాటిస్‌ఫ్యాక్షన్‌. Also Read: పగలు కంటే రాత్రి చాలా విలువైంది. మన చుట్టూ ఉన్న మైండ్స్ అన్నీ డీప్ స్లీప్‌లో ఉంటాయ్‌. మనం మాత్రమే మేల్కొని ఉంటాం. మనం మనతో కూర్చునే అవకాశం అప్పుడే దొరుకుతుంది. నిజమైన కల ఎప్పుడూ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కల లేనివాడే 8 గంటలకు పడుకుంటాడు. మరి మనమెందుకు పడుకుంటాం? బెల్జియం యూనివర్సిటీ వారు 15 గుడ్లగూబల్ని..15 ఎర్లీ బర్డ్స్‌ని తీసుకుని టెస్ట్ చేస్తే.. రాత్రిపూట మేల్కొనే గుడ్లగూబలకి ఎక్కువ ఐక్యూ ఉందని తెలిసింది. అలాగే మెర్డెడ్‌ యూనివర్శిటీ వాళ్లు 1000 మంది యువకులని టెస్ట్ చేస్తే.. రాత్రి పూట ఎక్కువగా మేల్కొని ఉండే వెధవలే.. ఎక్కువ షార్ప్‌గా ఉన్నారని తెలిసింది. లిస్టు బయటకు తీస్తే.. లేట్‌గా పడుకుని, లేట్‌గా లేచే వాళ్ళ బ్యాంక్‌ అకౌంట్స్‌లోనే డబ్బు ఎక్కువగా ఉందట. పల్లెటూళ్లన్నీ త్వరగా పడుకుంటాయేమో గానీ, పట్టణాలన్నీ.. రాత్రిపూటే నిద్రలేస్తాయి. ఎన్నో కోట్ల మంది ప్రతిరోజూ.. రాత్రి ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తాయ్‌. డ్యాన్స్ బార్లు, కెశినోలు, వీధి నాటకాలు, నైట్‌ బజార్లు. పగటి పూట చూసిన అదే ప్రపంచం రాత్రి మరోలా ఉంటుంది. లేట్‌ నైట్‌ పీపుల్‌కే క్రియేటివ్‌ సొల్యూషన్స్ దొరుకుతాయి. Also Read: కొన్ని ప్రొఫెషన్స్‌కి రాత్రే కరెక్ట్. బార్‌ ఓపెన్ చేసిన తర్వాత ఒక పొయిట్‌ రాయడం మొదలెడతాడు. ఒక మ్యూజిషియన్ ట్యూన్ చేయడం అప్పుడే మొదలెడతాడు. ఒక థింకర్‌, పండువెన్నెల చూస్తూ.. సముద్రపు ఒడ్డున కూర్చుని ఉంటాడు. ఎన్నో ఆలోచనలు ఒకేసారి అతనిని చుట్టేస్తుంటాయి. ఇలా నిశీధిలో ఎన్నో జరుగుతుంటాయి. విరహవేదన పడుతూ.. తలగడతో కలిసి అటు, ఇటు దొర్లే వాళ్లు, కూని రాగం తీస్తూ మెల్లగా మత్తులోకి జారేవాళ్లు, సారేగమ కార్వాన్ పెట్టుకుని పాత పాటలు వినేవాళ్లు, ఎన్నో గంటలు గడిచాయో తెలియని ప్రేమికుల సంభాషణలు.. ఇలా ఒకటి కాదు ఎన్నో జరుగుతాయి. మంచి స్నేహితులతో లేట్‌ నైట్‌ కాన్వర్జేషన్స్ ఎప్పుడూ బాగుంటాయ్. లేట్‌ నైట్‌ డ్రైవ్స్ బాగుంటాయ్‌. Also Read: ఎందుకో తెలియదు రాత్రి పూట ఒకరికి ఒకరు ఇంకా బాగా అర్థం అవుతారు. ‌కోళ్లు కూస్తున్న వేళ, విటులు విశ్రమిస్తుంటారు. అలసిపోయిన పోలీసులు కళ్లు నులుముకుంటూ కనబడతారు. తెల్లవారు జామనున దోశ బండి దగ్గర ఆగడాలు, వేడివేడి ఇడ్లీ తినడాలు, మెల్లగా ఇంటికి చేరడాలు.. ఇలా రాత్రి ఒక అద్భుతం. ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. ఆ రోజే గ్రేట్ డే. జీవితంలో మరిచిపోలేని రాత్రులు కొన్నే ఉంటాయి. అందుకే వీకెండ్స్‌ని అందమైన రాత్రులుగా మార్చి మన ఖాతాలో వేసుకోవాలి. వీకెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్‌'' అని అన్నారు పూరి జగన్నాథ్.


from https://ift.tt/2HdIbwB

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages