ఫ్లాష్‌బ్యాక్: ఆ ఒక్క మాటతో కృష్ణ, నేను కలిసిపోయాం.. వివాదంపై ఎస్పీ బాలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 26 September 2020

ఫ్లాష్‌బ్యాక్: ఆ ఒక్క మాటతో కృష్ణ, నేను కలిసిపోయాం.. వివాదంపై ఎస్పీ బాలు

సూపర్ స్టార్ కృష్ణ, గాన గంధర్వుడు మధ్య అప్పట్లో గొడవ జరిగిందని.. దీంతో కృష్ణ సినిమాలకు బాలు పాటలు పాడటం మానేశారని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇంతకీ వారిద్దరి మధ్య అసలు తగాదా ఎందుకు జరిగింది? బాలు గారికి కోపం ఎందుకు వచ్చింది? వంటి విషయాలు నేటి తరానికి తెలియకపోవచ్చు. ఈ వివాదంపై మూడేళ్ల క్రితం ఆలీతో సరదాగా కార్యక్రమంలో బాలు మాట్లాడినా అసలు వివాదం ఎందుకు వచ్చిందో చెప్పలేదు. పరిష్కారం ఎలా దొరికిందో చెప్పారు. నిజానికి కెరీర్ ప్రారంభంలో బాలుని కృష్ణ చాలా ప్రోత్సాహించారు. కృష్ణకు తొలిసారి ‘నేనంటే నేనే’ సినిమాకు మొత్తం పాటలు బాలు పాడారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎస్పీ కోదండపాణి స్వరపరిచి పాటలు కూడా పాపులర్ అయ్యాయి. ఆ తరవాత బాలుని కృష్ణ వదిలిపెట్టలేదు. ఆయన ప్రతి సినిమాలో బాలు పాటలు పాడారు. అలాంటిది ఒకసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అది కూడా నేరుగా కాదు.. టెలిఫోన్‌లో..! ఒక సినిమా పారితోషికం విషయం గురించి ఓ నిర్మాత (ఆయన పేరు చెప్పడానికి బాలు ఇష్టపడరు).. బాలుతో మాట్లాడిన మాటల్ని కృష్ణతో మరో రకంగా చెప్పారట. దీంతో కృష్ణకు కోపం వచ్చింది. ఈ విషయమై టెలిఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు బాలు చెప్పబోయేదాన్ని కృష్ణ వినలేదట. ‘‘మీరు పాడకపోతే నా సినిమాలు సక్సెస్ అవ్వవా’’ అని బాలుని కృష్ణ నిలదీశారట. దీంతో బాలు ఆత్మగౌరవం దెబ్బతింది. ‘‘మీకు పాడకపోయినా నేను ఎలాగోలా బతకగలను’’ అని బాలు సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేశారట. అప్పటి నుంచి రెండేళ్లపాటు కృష్ణ సినిమాలకు తాను పాడనని బాలు భీష్మించుకు కూర్చున్నారు. Also Read: అయితే, మరి కృష్ణ, తాను మళ్లీ ఎలా కలిశామో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో బాలు వివరించారు. ‘‘ఎప్పుడూ హార్ష్‌గా మాట్లాడని ఆయన.. ఎప్పుడూ హార్ష్‌గా బిహేవ్ చేయని నేను ఒక టెలిఫోన్ కాన్వర్జేషన్‌లో మాటా మాటా వచ్చి నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి నేను ఆయనకి పాటలు పాడలేదు. గొప్ప విశేషం ఏంటంటే.. బయట ఎక్కడ కనిపించినా ఆయన నన్ను మామూలుగానే ట్రీట్ చేశారు. నేనూ ఆయన్ని అంత గౌరవంతోనే చూశాను తప్ప ఏనాడూ మొహం తిప్పుకుని వెళ్లలేదు’’ అని బాలు చెప్పుకొచ్చారు. తాను కృష్ణకు పాడటం ఆపేసిన తరవాత కూడా ఆయనతో ఎదురైన ఒక సందర్భం గురించి బాలు చెబుతూ.. ‘‘ఏవండి, మా మహేష్ ఒక చిన్న వేషం వేశాడు. చెల్లెలు శైలజ పాడింది. ఒకసారి రషెస్ చూద్దామా? అని రికార్డింగ్ థియేటర్‌లో కూర్చోబెట్టి చూపించారాయన. అసలు మా ఇద్దరి మధ్య పాటల ప్రస్తావన వచ్చేదేకాదు. కానీ, ఇండస్ట్రీ నలిగిపోయింది. చాలా మంది సయోధ్య చేయడానికి ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. అది ఆత్మగౌరవానికి సంబంధించింది కదా’’ అని వెల్లడించారు. ఆ తరవాత కృష్ణ, తాను ఎలా కలిసిపోయామో కూడా బాలు చెప్పారు. ‘‘తొలిసారి కృష్ణ సినిమాకి రాజ్-కోటి సంగీతం అందిస్తున్నారు. వాళ్లిద్దరూ నన్ను పిండేశారు. మీరు ఎలా అయినా పాట పాడాలి గురువు గారు అని బతిమలాడారు. వేటూరి సుందరరామ్మూర్తి వచ్చాడు. ఏవయ్యా దిక్కుమాలిన పాట పాడితే ఏమవుతుంది.. పాడొచ్చుగా అని అన్నాడు’’ అని బాలు తెలిపారు. Also Read: అయితే, తాను మళ్లీ కృష్ణ గారికి పాటలు పాడటానికి సుందరరామ్మూ్ర్తే ముఖ్యమైన కారణమని చెప్పారు బాలు. ‘‘నేను కృష్ణ గారితో మాట్లాడాను.. అదేముంది బాలు, నేను ఎక్కడైనా కలుసుకుంటాం అన్నారు’’ అని సుందరరామ్మూర్తి తనకు చెప్పారని.. ‘‘ఆయన కాదు నేనే వెళ్లి కలుసుకుంటాను’’ అని చెప్పి తాను పద్మాలయ ఆఫీసుకు వెళ్లానని బాలు అన్నారు. ‘‘కృష్ణ గారి దగ్గరకి వెళ్లి ఏమండీ ఆరోజు నేను చెప్పదలచుకున్నది మీరు చెప్పనివ్వలేదు అని అనగానే.. ‘ఏవండి, అదంతా ఇప్పుడు ఎందుకు మనిద్దరం కలిసి పనిచేసుకుందాం హాయిగా’ అని అన్నారు. ఆ ఒక్క మాటతో ఆ వివాదానికి తెరపడిపోయింది’’ అని బాలు వివరించారు. ఇలా రాజ్-కోటి సంగీత దర్శకత్వం వహించిన ‘రౌడీ నంబర్ వన్’ సినిమాతో మళ్లీ కృష్ణ, బాలు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తరవాత వీరిద్దరి కాంబోలో అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇదిలా ఉంటే, బాలుతో వివాదం తలెత్తిన సమయంలోనే కృష్ణ సూపర్ హిట్ మూవీ ‘సింహాసనం’ వచ్చింది. తెలుగులో వచ్చిన తొలి 70ఎంఎం సినిమా ఇది. అప్పట్లో ఎన్నో రికార్డులను తిరగరాసిన బ్లాక్ బస్టర్. అప్పటి బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరి ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. అయితే, ఇందులో పాటలన్నింటినీ రాజ్ సీతారాం పాడారు. కానీ, ఆ పాటలు బాలు పాడి ఉంటే మరోలా ఉండేవని అంతా అంటారు.


from https://ift.tt/30chbnT

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages