కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుడు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. తాను సంపాదించే మొత్తంలో కొంత సమాజ సేవకు ఉపయోగిస్తున్నారు. తన వల్ల కాకపోతే విరాళాలు సేకరించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇటీవల లక్షా పది వేల రూపాయలు వెచ్చించి ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన శంకర్.. తాజాగా కరోనా వైరస్ కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఆ ఏడు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి కరీంనగర్ వీధుల్లో శంకర్ భిక్షాటన చేశారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా.. మిగిలిన డబ్బులు తాను జోడించి, మొత్తం లక్ష రూపాయలతో కరీంనగర్‌లోని ఏడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి, అందుకు తనకు సహకరించిన కరీంనగర్ ‘విందు భోజనం’ మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీటీఆర్‌లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం కోసం వేడుకుంటున్నానని శంకర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే, శంకర్ ప్రస్తుతం హీరోగా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘లాస్ట్ గాడ్‌ఫాదర్’ అనే సినిమాను శంకర్ మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే, ‘రాంగ్ గోపాల్ వర్మ’ సినిమాలో శంకర్ టైటిల్ రోల్ పోషించారు. ఇంకా, ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ అనే సినిమా కూడా శంకర్ చేస్తున్నారు. Also Read: Must Read:
from https://ift.tt/3ko76fm
No comments:
Post a Comment