గాన శిఖరం నేలకొరిగింది. లెజెండరీ సింగర్ (74) అశేష అభిమాన వర్గాన్ని, సినీ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన మరణం తాలూకు విషాదం యావత్ సినీ వర్గాలను కంటతడి పెట్టిస్తోంది. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం అశ్రునయనాల మధ్య బాలు పార్దీవదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లోఅన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో తమ అభిమాన గాయకుడిని చివరి చూపు చూసుకోవాలని ఫామ్‌హౌస్ పరిసరాలకు లక్షలాది మంది బాలు అభిమానులు చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో అభిమానులెవ్వరినీ ఫామ్‌హౌస్ లోనికి అనుమతించడం లేదు చెన్నై పోలీసులు. ఈ మేరకు ఫామ్‌హౌస్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే భారీకేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం బాలు సన్నిహితులు, సినీ ప్రముఖులు, మీడియాను మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతిస్తున్నారు. బాలు అంత్యక్రియలు చూడాటానికి వస్తున్న అభిమానుల తాడికి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. Also Read: ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే తామరైపాకం ఫామ్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. అలాగే కమల్ హాసన్, రజినీకాంత్, తమిళనాడు సీఎం పళనిస్వామిలు బాలు పార్దీవదేహాన్ని సందర్శించేందుకు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
from https://ift.tt/3406B4z
No comments:
Post a Comment