Roja: రొమాంటిక్ షాట్ చేస్తుంటే చిరంజీవి.. నేనైతే రెచ్చిపోయా.. అందరిముందే ఓపెన్ అయిన రోజా - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 23 August 2020

Roja: రొమాంటిక్ షాట్ చేస్తుంటే చిరంజీవి.. నేనైతే రెచ్చిపోయా.. అందరిముందే ఓపెన్ అయిన రోజా

మెగాస్టార్ చిరంజీవి, గ్లామర్ బ్యూటీ ఈ ఇద్దరూ కలిసి అప్పట్లో వెండితెరను షేక్ చేసేశారు. దూకుడులో ఒకరిని మించి ఇంకొకరు.. స్టెప్పులేయడంలో కెమెరా కూడా తట్టుకోలేని స్పీడు.. ఇక అందం, అభినయం అందుకు తగ్గ గ్రేస్ అన్నీ సమపాళ్లలో కనబర్చుతూ హుషారెత్తించారు. అందుకే ఆ రోజు మొదలు పెట్టిన వీరిద్దరి ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. మెగాస్టార్ వెండితెరపై రాణిస్తుంటే.. గ్లామర్ క్వీన్ రోజా అటు రాజకీయాలు చేస్తూనే ఇటు బుల్లితెరపై జబర్దస్తీ చేస్తోంది. ఇక అప్పట్లో చిరంజీవితో కలిసి రోజా వేసిన చిందులు, రొమాంటిక్ సాంగ్స్.. ఆ హుషారు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ అలా నిలిచిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నో కొత్త పాటలు, అంతకు మించిన సరికొత్త డాన్సులతో జనం కొత్తదారిని వెతుకుతున్నప్పటికీ.. రోజా- చిరు కాంబోలో వచ్చిన సాంగ్స్ మాత్రం ఇప్పటికీ హోరెత్తిస్తూనే ఉన్నాయి. అయితే ఆయా పాటలు చిత్రీకరిస్తున్నప్పటి సంగతులను చెబుతూ ఓపెన్ అయింది రోజా. 'ముఠామేస్త్రీ' సినిమాలో చిరంజీవితో చిందేస్తూ యమ కిక్కిచ్చిన ఆమె.. తాజాగా వాటి వెనుక ఉన్న రహస్యాలు బయటపెట్టింది. Also Read: ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా 'అనుకున్నదొకటి అయ్యిందొకటి 2020' అనే ప్రోగ్రాం చేశారు. ఇందులో రోజాతో పాటు శ్రీముఖి, హైపర్ ఆది, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి అంతా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా రోజా ఆ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ''ఆ రోజుల్లో చిరంజీవితో డాన్స్ చేయడమంటే అదో సవాల్. ఆయనతో నాకు రొమాంటిక్ సాంగ్స్, ఈలలు వేసే మాస్ సాంగ్ కూడా పడ్డాయి. అదే సినిమాలో 'మామా మామా' అనే మాస్ సాంగ్ ఓ రేంజ్‌లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ షూటింగ్ సమయంలో చిరంజీవి రొమాంటిక్ షాట్ చేసేందుకు కాస్త సిగ్గుపడ్డారు. దీంతో అదే దొరికిన ఛాన్స్ అని నేనైతే రెచ్చిపోయాను.. అందుకే ఆ సాంగ్‌లో పోటాపోటీగా చిందులేశాము'' అంటూ సీక్రెట్స్ రివీల్ చేసింది రోజా. ఇకపోతే ''అమ్మో ఈ అమ్మాయిని అస్సలు నమ్మొద్దు. ప్రాక్టీస్ ఒకలా చేస్తోంది..కెమెరా ముందు ఒకలా చేస్తోంది'' అని చిరంజీవి అనేవారంటూ జబర్దస్త్ విషయాలు చెప్పింది రోజా. Also Read:


from https://ift.tt/3hoznkG

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages