Mohan Babu: మంచు విష్ణు కోరిక మేరకు మోహన్ బాబు.. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని కథ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 21 August 2020

Mohan Babu: మంచు విష్ణు కోరిక మేరకు మోహన్ బాబు.. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని కథ

ప్రతి ఏడాది పండగను దేశమంతా ఘనంగా జరుపుకుంటుంది. వీధి వీధినా కొలువు దీరిన వినాయకుడు సందడి వాతావరణం క్రియేట్ చేస్తాడు. చిన్న- పెద్ద, పేద- ధనిక అనే తారతమ్యం లేకుండా ఆంతా ఈ వేడుకలో భాగమై నవరాత్రులు ఆ గజాణన మహర్షికి పూజలందిస్తూ సేవ చేస్తారు. వినాయక మండపాలన్నీ కళకళలాడుతూ ఊరికి కొత్త శోభను తీసుకొస్తాయి. మరి ఈ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం? అసలు వినాయకుడికి ఆ రూపం ఎలా వచ్చింది? అనే విషయం తెలుసుకోవడమంటే అందరికీ ఆసక్తే కదండీ. తాజాగా ఆ విఘ్నేశ్వరుని కథను సవివరంగా, సంపూర్ణంగా చెప్పి ఆకట్టుకున్నారు డాక్టర్ . ''నేను చదవడం, వినడం దగ్గరినుంచి ప్రతి సంవత్సరం నేను ఇష్టపడే పండుగలు చాలా ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలను చదివి, వినాయక కథను వినిపించడం నాకు అలవాటు. అయితే ఈ ఏడాది ఈ వినాయక కథను మీ అందరికీ వినిపించాలని నా పెద్ద కుమారుడు విష్ణు వర్ధన్ బాబు కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుని కథను వినిపిస్తున్నాను. శుభంబు యార్'' అంటూ స్టార్ట్ చేసిన మోహన్ బాబు విఘ్నేశరుని కథను ఎంతో మాధుర్యంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించారు మోహన్ బాబు. అలాగే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి అందరి ముందుంచారు. ఇక మోహన్ బాబు సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా ఆచూతూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ సీనియర్ యాక్టర్ ‘గాయత్రి’ మూవీ తర్వాత మరోసారి హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించలేదు. మొన్న ఆగష్టు 15 (74వ స్వాతంత్య్ర దినోత్సవం) సందర్భంగా తన కొత్త సినిమా ''సన్ ఆఫ్ ఇండియా''ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. దేశభక్తి ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.


from https://ift.tt/2CPNUHk

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages