నాకు నిజమైన ‘ఆచార్య’ మెగాస్టార్: పిండేసిన బన్నీ.. చిరుకి శుభాకాంక్షల వెల్లువ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 21 August 2020

నాకు నిజమైన ‘ఆచార్య’ మెగాస్టార్: పిండేసిన బన్నీ.. చిరుకి శుభాకాంక్షల వెల్లువ

మెగాస్టార్ నేడు (ఆగస్టు 22న) తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి రోజునే చిరంజీవి పుట్టినరోజు రావడం విశేషం. ఈరోజు మెగా అభిమానులు రెండు పండుగులను జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో మెగా హీరోలు కూడా ఉన్నారు. Also Read: అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు విక్టరీ వెంకటేష్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, శ్రీకాంత్, శ్రీను వైట్ల, దేవిశ్రీ ప్రసాద్, ఆది పినిశెట్టి, రాశీ ఖన్నా, సునీల్, కార్తికేయ, డైరెక్టర్ బాబీ, డైరెక్టర్ మారుతి తదితరులు చిరంజీవికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హీరో సత్యదేవ్ అయితే చిరంజీవి పాటలకు స్టెప్పులేసి ట్రిబ్యూట్ ఇచ్చారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ‘‘మన ఒకే ఒక్క మెగాస్టార్‌ ఇలాంటి ఆనందమైన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా హృదయం ఎప్పుడూ గౌరవం, ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా ఆయన నా నిజమైన ‘ఆచార్య’. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి’’ అని పేర్కొన్నారు. ‘‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు. అతని పేరులోనే ఉంది చిరంజీవి.. అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. చిరంజీవి తామందరికీ స్ఫూర్తిదాయకమని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్. మీరు నా వైపు ఉండటం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నాలో స్ఫూర్తిని నింపడమే కాకుండా నాకు ఎంతో చేసిన మీకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇతర సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు..


from https://ift.tt/3l86dIX

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages