‘రాంగ్ గోపాల్ వర్మ’ మూవీ పోస్టర్ వదిలిన సోషల్ యాక్టివిస్ట్ దేవి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 21 August 2020

‘రాంగ్ గోపాల్ వర్మ’ మూవీ పోస్టర్ వదిలిన సోషల్ యాక్టివిస్ట్ దేవి

అందర్నీ గిల్లి మరీ.. గిల్లికజ్జాలు పెట్టుకునే వర్మపై వరస సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే ‘పరాన్నజీవి’ అనే చిత్రం విడుదల కాగా.. గేయ రచయిత జొన్నవిత్తుల ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ‘రాడ్ గోపాల్ వర్మ’ అంటూ మరో దర్శకుడు కె.ఎస్.మణి వర్మ పైత్యంపై బాణం ఎక్కుపెట్టాడు. ఇక ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు సైతం వర్మపై సినిమాను రూపొందిస్తున్నారు. '' అనే టైటిల్‌తో శుక్రవారం నాడు టైటిలో లోగా పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను సోషల్ యాక్టివిస్ట్ దేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహా తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఏ సమాజం కారణంగా తాను మనుగడ సాగిస్తున్నాడో... ఆ సమాజానికి తాను జవాబుదారీ కాదని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకునే వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాల్సి ఉందని ఆమె ప్రకటించారు. ఈ చిత్రం కోసం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన పాట తాను విన్నానని, చాలా బాగుందని ఆమె అన్నారు. ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని. పతాక సన్నివేశాలు, పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుందని రచయిత-దర్శకనిర్మాత ప్రభు చిత్ర విశేషాలను తెలియజేశారు.


from https://ift.tt/2EnknVI

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages