ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే మోహన్ బాబు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏపీలో పాలన బాగుందని ఆ పార్టీకి నా మద్దతు ఉంటుందని అన్నారు మోహన్ బాబు. అయితే గతంలో ఫీజుల విషయంలో తెలుగుదేశం పార్టీపై విమర్శల గళం విప్పిన ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారనే ప్రశ్నపై స్పందిస్తూ.. ఫీజుల విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం అప్పుడు ఇస్తాం.. ఇప్పుడు ఇస్తాం అని చెప్తోందని నాటి ప్రభుత్వం సమాధానమే చెప్పలేదన్నారు మోహన్ బాబు. చంద్రబాబుని ఫీజుల విషయంలో ఎప్పుడూ కలవలేదని.. చాలాసార్లు ఫోన్‌లోనే మాట్లాడానన్నారు. ప్రస్తుతం తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజుల బకాయిల విషయంలో నా విద్యాసంస్థలకు సీఈఓగా ఉన్న విష్ణు.. ముఖ్యమంత్రి జగన్‌ని కలిశారని.. ఆయన త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారన్నారు. ఇక సినిమా-రాజకీయ ప్రస్థానంలో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేస్తారు మోహన్ బాబు. ఆయన మాట్లాడుతూ.. ‘సినిమావాళ్లు రాజకీయాల్లో రాణించడం అనేది ఇక వర్కౌట్ కాదు. సినిమాలు హిట్ అయినంతమాత్రాన రాజకీయాల్లో రాణిస్తారని అనుకోలేం. వాళ్ల జాతకంలో రాసి ఉంటే అవ్వొచ్చేమో కాని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఇన్నేళ్ల నా సినీ, రాజకీయ ప్రస్థానంలో నాకు అసంతృప్తి రాజకీయంలో ఉండిపోయింది. రాజకీయంలో ఒకడు నన్ను దెబ్బకొట్టాడు. ఇప్పుడు అతని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అప్పట్లో మేం ఇద్దరం కలిసి వ్యాపార సంస్థ కూడా పెట్టాం. అది కొట్టేసి.. తరువాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. నన్ను మోసం చేశాడు.. చచ్చిన పాముని కొట్టకూడదు అంటారు.. ఆ సామెతను కొన్ని సందర్బాల్లో ఉపయోగించాలి. ఆ వ్యక్తి పేరు ఎన్నో సందర్బాల్లో చెప్పాను.. హిస్టరీలో దొరుకుతుంది. అది మామూలు విషయం కాదు.. కొంతమంది అడ్జెస్ట్ అవ్వమని అన్నారు.. అలాంటి వాళ్లను ఒరేయ్ పిచ్చ*** మనుషుల్లారా?? నా కాలికి ముళ్లు గుచ్చుకుంటే.. బాధ నాకు తెలుస్తోంది నీకు తెలియదు నొప్పి మూర్ఖుడా.. వాడి దగ్గర లాభాల పొంది.. పదవులు పొంది.. వాడ్ని కాకాపడుతూ బతుకుతున్న వాడివిరా నువ్.. నన్ను దొబ్బకొడితే అడ్జెస్ట్ అవ్వాలా.. ఈరోజు కొన్నివేల కోట్లకు అధిపతి అయ్యాడు’ అంటూ ఆ ముఖ్యమంత్రి పేరు ప్రస్థావించకుండానే తూట్లు పొడిచే కామెంట్స్ చేశారు మోహన్ బాబు.
from https://ift.tt/34nq8h3
No comments:
Post a Comment