సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరగాళ్లు, ఆన్‌లైన్ కేటుగాళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సైబర్ రూల్స్ అతిక్రమిస్తున్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించడం, సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులకు పాల్పడటం లాంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సైబర్ పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఈ కేటుగాళ్లు లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హపై వల్గర్ పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఓ యువకుడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో సోనాక్షిని అసభ్య పదజాలంతో దూషిస్తూ వల్గర్ పోస్టులు పెట్టి రెచ్చిపోయాడు. ఆ పోస్టులు చూసిన వెంటనే ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: ఆ వ్యక్తి ఔరంగబాద్‌కు చెందిన శశికాంత్ గులాబ్ జాదవ్‌గా గుర్తించారు పోలీసులు. ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద పలు అతనిపై కేసులను నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది సోనాక్షి సిన్హా. ఈ మేరకు ఆన్‌లైన్ ప్రపంచం సేఫ్‌గా ఉండే వరకూ తాను సైలెంట్‌గా ఉండనని, సోషల్ మీడియాలో వేధింపులను ఏ ఒక్కరూ సహించకూడదని, వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని పేర్కొంది సోనాక్షి.
from https://ift.tt/3l6LYeV
No comments:
Post a Comment