భుజాన ఉన్న బిడ్డ చనిపోయిందని తెల్వక.. యూట్యూబ్ స్టార్ గంగవ్వ జీవితంలో విషాదాలెన్నో.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 19 August 2020

భుజాన ఉన్న బిడ్డ చనిపోయిందని తెల్వక.. యూట్యూబ్ స్టార్ గంగవ్వ జీవితంలో విషాదాలెన్నో..

కూలీ పనులు చేసుకుంటూ.. ఊరు దాటి బయటికి వెళ్లడం తెలియని ఆమెను యూట్యూబ్ ఓ స్టార్‌గా మార్చేసింది. ‘’ ద్వారా ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా కనిపించే ఆమె తన అమాయకత్వంతో.. అచ్చ తెలంగాణ యాసతో జనాన్ని ఆకట్టుకుంటోంది. అక్షరం ముక్క రాని గంగవ్వకు సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు ఉన్నారు. 8 మంది మనవలు, మనవరాళ్లు ఉన్న గంగవ్వకు తన అసలు వయసెంతో కూడా తెలీదు. జగిత్యాల జిల్లాలోని లంబాడపల్లి ఆమె సొంతూరు. 2012లో ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. అప్పటికి గంగవ్వకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలీదు. శ్రీరామ్ ఊళ్లో వీడియోలు తీస్తుంటే ఈ పిల్లగాడు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నడు అనుకునేది. అలాంటి ఆమె జీవితం ఆ వీడియోల కారణంగానే మారిపోయింది. 2017లో ఆమె పూర్తి స్థాయిలో యూ ట్యూబ్ ఛానల్‌లో భాగమైంది. ఆమె కెమెరా ముందు మాట్లాడితే.. మనతో మాట్లాడుతున్నట్లే సహజంగా ఉంటుంది. నటనలా అనిపించదు. గంగవ్వ నటనకు జనం ఫిదా కావడంతో.. 15 లక్షల మందికిపైగా ఆ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్‌గా మారక ముందు గంగవ్వ ఎన్నో కష్టాలు పడింది. చదువుకొని ఆమె బీడీలు చుడుతూ కుటుంబానికి అండగా నిలిచింది. భర్త తాగుబోతు కావడంతో ఆమె ఎంతో కష్టపడి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకును పెంచి పెద్ద చేసింది. గంగవ్వ యూట్యూబ్ పరిధిని దాటేసి ముందుకెళ్లింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 45 వేల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం సినిమాల్లో నటించింది. వందకుపైగా షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించింది. ‘మై విలేజ్ షో’లో నటించడానికి ముందు గంగవ్వ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఆమెకు ఊహ తెలియక ముందే తండ్రి చనిపోయాడు. 13 ఏళ్లొచ్చాక తల్లి మరణించింది. దీంతో తమ్ముళ్ల బాధ్యతను ఆమే తీసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడంతో.. రోజూ గొడవలయ్యేవి. పగలు కూలీ పనులకు వెళ్తూ.. రాత్రి పూట బీడీలు చుడుతూ పిల్లలను పెంచింది. పదిహేనేళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లిన భర్త నయాపైసా పంపలేదు. ఆయన అక్కడే చనిపోయాడని తర్వాత తెలిసింది. భర్త గల్ఫ్ వెళ్లిన తర్వాత గంగవ్వ చిన్న కుమార్తె అనితకు ఎనిమిదేళ్ల వయసులో జ్వరం వచ్చింది. దీంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించింది. వారం రోజులైన తర్వాత నీ బిడ్డను ఇంటికి తీసుకుపో అని డాక్టర్ చెప్పడంతో భుజాన వేసుకొని బస్టాండుకు వెళ్లింది. మెడ వేలాడుతుండటంతో.. చనిపోయిన బిడ్డను ఎత్తుకున్నావెందుకు అని ఎవరో గంగవ్వను అడిగారు. నా బిడ్డ చనిపోలేదు.. నిద్ర పోతోందని గంగవ్వ అమాయకంగా చెప్పింది. చనిపోతేనే ఇలా మెడ, కాళ్లు వేలాడుతాయని చెప్పడంతో.. కిందకు దింపి చూసే సరికి బిడ్డ చనిపోయిందని తెలిసింది. దీంతో గంగవ్వ బస్టాండ్‌లోనే గుండెలవిసేలా రోదించింది. ఈ కష్టాలన్నీ దిగమింగుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపిన గంగవ్వ.. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యామని తన అప్పులన్నీ తీర్చేసింది. నిలకడగా ఆదాయం వస్తుండటంతో... త్వరలోనే ఓ ఇల్లు కట్టుకుంటానని చెబుతోంది.


from https://ift.tt/3iYp8nP

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages