‘బుచ్చినాయుడు కండ్రిగ’ రివ్యూ: రొటీన్ లవ్ స్టోరీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 21 August 2020

‘బుచ్చినాయుడు కండ్రిగ’ రివ్యూ: రొటీన్ లవ్ స్టోరీ

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతబడటంతో పెద్ద చిత్రాలకు ప్రేక్షకులు దూరమయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా చిన్న సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. అలరిస్తున్నాయి. ముఖ్యంగా 100 శాతం తెలుగు కంటెంట్‌‌ను అందిస్తోన్న ‘ఆహా’ మంచి చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇప్పటికే ‘భానుమతి & రామకృష్ణ’, ‘జోహార్’ సినిమాలతో సక్సెస్ అందుకున్న ‘ఆహా’.. ఇప్పుడు ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి...’ సినిమాను ప్రీమియర్ చేసింది. కథ: అది ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి’ అనే గ్రామం. బాలు తన ఎదురింట్లో ఉండే స్వప్నను చిన్నప్పటి నుంచీ ఇష్టపడతాడు. ఆమె లోకంలోనే బతుకుతాడు. కాలేజీకి వెళ్లే వయసులో ఆమెతో ప్రేమలో పడతాడు. స్వప్న కూడా బాలుని ప్రేమిస్తుంది. స్వప్న తండ్రికి కుల పిచ్చి. తమ కులానికి చెందిన పిల్లలతోనే తన కూతురు స్నేహం చేయాలని ఆలోచించే వ్యక్తి. మరోవైపు, తన కొడుకుని రైల్వే స్టేషన్ మాస్టర్ చేయాలని కలలు కంటుంటాడు బాలు తండ్రి. కొడుకు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం ఆయనది. ఈ క్రమంలో కూతురి ఇష్టాన్ని తెలుసుకోకుండా బావమరిదితో పెళ్లి ఖాయం చేస్తాడు స్వప్న తండ్రి. దీంతో బాలు, స్వప్న కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఆ తరవాత ఏం జరిగింది? పరువు కోసం ప్రాణాలు తీసే స్వప్న తండ్రి ఏం చేశాడు? కొడుకు భవిష్యత్తు కోసం కలలు కనే బాలు తండ్రి ఏం చేశాడు? అనేదే అసలు సినిమా. రివ్యూ: ఇది ప్రతి ఊరిలో జరిగే కథ. పరువు కోసం, కులం కోసం కన్న బిడ్డల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని తండ్రులు ఉంటోన్న మన వీధి కథ. ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి’లో చోటుచేసుకున్న కథ. నిజానికి ఇది రొటీన్ స్టోరీ. ఒక సింపుల్ కథను మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ఒక అందమైన చిత్రంగా మలచడంలో దర్శకుడు కృష్ణ పోలూరు పూర్తిగా విజయం సాధించలేకపోయారు. కథనం బలంగా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. ఈ ఆధునిక సమాజంలో ఇప్పటికీ వెలుగు చూస్తోన్న పరువు హత్యల నేపథ్యాన్ని ఎంపిక చేసుకున్న దర్శకుడు దాన్ని బలంగా చెప్పలేకపోయారు. సినిమా మొత్తం ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు అనిపించినా అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోర్ కొడతాయి. ప్రేక్షకుడిని అబ్బురపరిచే సన్నివేశం ఒక్కటీ లేకపోవడం మరో మైనస్. తరవాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే ఊహించేయొచ్చు. కామెడీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ, ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు బలం. ప్రేక్షకుడితో కంటతడి పెట్టించే ట్విస్ట్ అది. ఇక క్లైమాక్స్ మామూలే.. ఊహించదగినదే. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు RX 100 మాదిరిగా ఉందని చాలా మంది అనుకున్నారు. కానీ, ఆ సినిమాకు దీనికి అస్సలు పోలిక లేదు. ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటులు. హీరోహీరోయిన్లు మున్నా, దృశిక చందర్‌తో పాటు ప్రతి ఒక్కరూ చాలా సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. ‘కంచరపాలెం’ సినిమాలో తన నటనతో మెప్పించిన సుబ్బారావు.. ఈ సినిమాలో హీరో తండ్రిగా మంచి నటనను కనబరిచారు. కొడుకుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇక నెగిటివ్ షేడ్స్‌ కనిపించే తండ్రి పాత్రలో ఎప్పటిలానే రవివర్మ అడ్డూరి ఆకట్టుకున్నారు. హీరో మున్నా, హీరోయిన్ దృశిక మంచి నటన కనబరిచారు. ఈ సినిమాలో పాత్రలన్నీ నెల్లూరు యాసలో మాట్లాడటం మరో ఆకర్షణ. ఇక టెక్నికల్‌గానూ ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. మిహిరాంశ్ స్వరపరిచిన పాటలు చాలా బాగున్నాయి. సినిమాలో పాటలు కూడా సందర్భానుసారంగా వచ్చాయి. ఇక, నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా బాగుంది. రామ్ కె మహేశన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. నెల్లూరి జిల్లాలోని పల్లె అందాలను, మైసూర్ పరిసర కొండ ప్రాంతాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాను సాగదీయకుండా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేమో అనిపించింది. చివరిగా.. ఇది మన ఊరి కథ.. కులం, పరువు కన్నా ప్రేమ గొప్పది, త్యాగం గొప్పది, ప్రాణం గొప్పది అని చెప్పే కథ. కాకపోతే.. రొటీన్ కథ.


from https://ift.tt/31eF8fm

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages