అనుమానాలను రెక్కలుకట్టిన రియా, మహేష్ భట్ వాట్సాప్ చాట్.. సుశాంత్ మరణానికి ముందే వాళ్లిద్దరూ!! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 20 August 2020

అనుమానాలను రెక్కలుకట్టిన రియా, మహేష్ భట్ వాట్సాప్ చాట్.. సుశాంత్ మరణానికి ముందే వాళ్లిద్దరూ!!

బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జూన్ నెల 14వ తేదీన ఉహించని విధంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడటంతో అంతా షాక్ అయ్యారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్లు వచ్చినప్పటికీ.. ఆయన మరణంపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు ముంబై పోలీసులు. ఈ క్రమంలో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తున్నాయి. అయితే ఈ కేసులో సుశాంత్ ప్రేయసి రియాను కీలకంగా పరిగణిస్తున్న క్రమంలో సుశాంత్ మరణానికి ముందే ఆమె దర్శకనిర్మాత మహేష్ భట్‌తో చేసిన వాట్సాప్ చాట్ బయటపడటంతో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. గురువారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో రియా, మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతోంది. ఇది సుశాంత్ మరణానికి ముందు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కావడం, పైగా సుశాంత్‌- రియా ప్రేమ వ్యవహారానికి సంబంధించింది కావడంతో తెగ వైరల్ అయి జనాల్లో పలు చర్చలను లేవనెత్తింది. జూన్ 8వ తేదీన మహేష్ భట్‌తో వాట్సాప్ చాట్ చేసింది. ఆ తర్వాత సరిగ్గా వారానికి అంటే జూన్ 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read: అయితే జూన్ 8న మహేష్ భట్‌తో రియా జరిపిన సంభాషణను బట్టి చూస్తే.. ఆమె సుశాంత్‌కి ఆ రోజే గుడ్ బై చెప్పేసిందని తెలుస్తోంది. అంతకుముందు నుంచే వారిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లుగా అర్థమవుతోంది. సుశాంత్‌తో ప్రేమాయణం తన తండ్రికి నచ్చలేదని రియా పేర్కొనడం, దానిపై మహేష్ భట్ కూడా సుశాంత్‌తో కట్ చేసుకోవడమే మంచిదన్నట్లుగా సలహా ఇవ్వడం ఈ చాట్‌లో కనిపిస్తోంది. ''అయేషా మూవ్స్ ఆన్ సార్.. ఇప్పుడు హాయిగా ఉంది'' అంటూ రియా మెసేజ్ చేస్తే.. ఇక వెనక్కి తిరిగి చూడకు, మీ తండ్రికి నీ మీద చాలా ప్రేమ. అతను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు'' అని మహేష్ భట్ రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ సంభాషణపై ప్రస్తుతం మీడియాలో ఓ రేంజ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. మహేష్ భట్ నిర్మించిన ‘జలేబి’ సినిమాలో రియా చక్రవర్తి అయేషా అనే పాత్రలో నటించింది. అప్పటినుంచే వీరిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని సమాచారం. కాగా ఇప్పటికే రియా ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టిన పోలీసులు మహేష్ భట్, రియా 18 సార్లు కాల్స్ చేసుకున్నారని తేలడం, ఇప్పుడు ఈ చాట్ బయటపడటం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చూడాలి మరి సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో సుశాంత్ డెత్ మిస్టరీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో!.


from https://ift.tt/2YkKF1Q

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages