బాలీవుడ్ యువ నటుడు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సూసైడ్ చేసుకొని రెండు నెలలు దాటినా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సూసైడ్ మిస్టరీలో ఇప్పటికే సుశాంత్‌తో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పు మేరకు సీబీఐ రంగంలోకి దిగి కేసు విచారణ వేగవంతం చేసింది. అయితే ఈ పరిస్థితుల్లో ఎలాగైనా తనపై అపవాదు రాకుండా చూసుకోవాలని రియా ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఓ బడా దర్శకుడితో కలిసి రియా మాస్టర్ ప్లాన్ వేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసు విషయమై జనాల్లో తనపై ఓ తప్పుడు అభిప్రాయం ఉందని గ్రహించిన రియా.. ఓ దర్శకుడి సహాయంతో ప్రముఖ జర్నలిస్టుతో భారీ డీల్ కుదుర్చుకుందని వార్తలు వెలువడుతున్నాయి. జనాల్లో తనపై పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేయాలని ఆ జర్నలిస్టును కోరిన ఆమె, అందుకోసం నోట్ల కట్టలు కుమ్మరించిందని అంటున్నారు. వెనుక నుంచి రియా PR టీమ్ ఈ కథ అంతా నడిపిస్తున్నారని టాక్. Also Read: ఈ స్కెచ్‌లో భాగంగానే రీసెంట్‌గా వాట్సాప్ చాట్ బయటపెట్టి ఆ దర్శకుడికి, తనకు మధ్య తండ్రీ కూతుళ్ళ రిలేషన్‌షిప్ ఉన్నట్లుగా తెలిపారని అంటున్నారు. రియానే స్వయంగా ఈ చాట్ సదరు జర్నలిస్టుకు ఇచ్చి మీడియాలో వచ్చేలా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్ సూసైడ్ కేసును సీరియస్‌గా తీసుకొని సీబీఐ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సో.. చూడాలి మరి ఈ కేసుకు ఎలాంటి ముగింపు లభిస్తుంది? దోషులుగా ఎవరైనా తేలుతారా? లేదా? అనేది.
from https://ift.tt/2Yvxj33
No comments:
Post a Comment