Bigg Boss4: బిగ్ బాస్‌లో గంగవ్వ.. పల్లెటూరి పదునైన పదాలతో హౌస్‌లో రచ్చ రచ్చ.. సీక్రెట్‌ ప్లాన్!! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 20 August 2020

Bigg Boss4: బిగ్ బాస్‌లో గంగవ్వ.. పల్లెటూరి పదునైన పదాలతో హౌస్‌లో రచ్చ రచ్చ.. సీక్రెట్‌ ప్లాన్!!

బుల్లితెర ప్రేక్షకులు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 4' మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ షో ప్రోమో వీడియోలు రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించిన మేకర్స్.. ఇందులో పాల్గొనబోయే కంటిస్టెంట్స్ ఎవరనేది ఏ మాత్రం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయాన్ని మాత్రమే అఫీషియల్ చేసిన మేనేజ్మెంట్ ఈ షో ఎన్ని రోజులు జరగనుంది? ఎంతమంది కంటిస్టెంట్స్ ఉంటారు? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు బిగ్ బాస్ కంటిస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురి పేర్లు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ పేరు 'బిగ్ బాస్ 4'పై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రతి బిగ్ బాస్ సీజన్‌లో ఫేమస్ అయిన వ్యక్తులను కంటిస్టెంట్లుగా తీసుకొని వారితో టాస్కులు చేయిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతుంటారు. కానీ ఈ సారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొట్టుకునే టాస్కులు నిర్వహించడం, ఒకరినొకరు తాకడం లాంటివి నిషేధిస్తూ కాస్త డిఫరెంట్ ఆలోచనలు చేసిన మేనేజ్‌మెంట్.. మాటలతో మాయ చేసే కంటిస్టెంట్స్‌ని సెలెక్ట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ స్కెచ్‌లో భాగంగా ప్రత్యేకంగా మై విలేజ్ షో సెన్సేషన్ గంగవ్వను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరిగిపోయాయని, మిగితా కంటిస్టెంట్లతో పాటు గంగవ్వను కూడా క్వారంటైన్ పంపించబోతున్నారనేది తాజా సమాచారం. ముచ్చట్లతో, పల్లెటూరి పదునైన పదాలతో హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తూ సరికొత్తగా వినోదం పంచేలా సన్నాహాలు కూడా పూర్తయ్యాయట. Also Read: ఇదే నిజమైతే గంగవ్వ సందడితో ఈ సారి బిగ్ బాస్ సరికొత్త శోభ సంతరించుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాగే మిగిలిన కంటిస్టెంట్లతో గంగవ్వ ముచ్చట్లు, కత్తి లాంటి మాటలు మాములుగా ఉండవు లెండి. చూడాలి మరి నిజంగానే ఈ పల్లెటూరి ముసలవ్వ సందడి వార్త ఎంతవరకు నిజమవుతాయో!.


from https://ift.tt/2EhFKrv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages