బుల్లితెర భారీ పాపులారిటీ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ ఉండదేమో, ఆ హంగామా లేక బుల్లితెర చిన్నబోతుందేమో అనుకున్నారంతా. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ 4 ప్రోమో రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది స్టార్ మా యాజమాన్యం. ఈ క్రమంలోనే వరుస ప్రోమోలు రిలీజ్ చేస్తూ సీజన్ 4పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశారు. అయితే ఈ షో ప్రారంభ తేదీ, కంటిస్టెంట్స్ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచి జనాల్లో క్యూరియాసిటీ పెంచేశారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 4కి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కంటిస్టెంట్ వివరాలు, ప్రారంభ తేదీ ఇదే అంటూ కుప్పలు కుప్పలుగా వార్తలు రావడంతో సరిగ్గా ఏది నిజం అని తేల్చుకోలేక పోయారు బుల్లితెర ఆడియన్స్. అయితే తాజాగా వికీపీడియాలో బిగ్ బాస్ 4కి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావడంతో ఆ డేట్, ఆ వివరాలు పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. Also Read: వికీపీడియాలో ఉన్న సమాచారం మేరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఆగష్టు 30వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 15 మంది ఇందులో కంటిస్టెంట్స్.. 105 రోజులు, 106 ఎపిసోడ్స్‌తో బిగ్ బాస్ అలరించనున్నట్లు ఇందులో సమాచారం పొందుపర్చారు. ఈ డేట్ దగ్గరలోనే ఉండటంతో ప్రేక్షకులు హుషారెత్తిపోతున్నారు. కాగా ఈ ఏడాది బిగ్ బాస్ గత సీజన్ల కంటే బిన్నంగా ఉండనుందని సమాచారం. మరోసారి ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరంటే.. 1. సయ్యద్ సోహెల్ (క్రిష్ణవేణి సీరియల్ యాక్టర్, యురేక మూవీ హీరో) 2&3. మహాతల్లి జాహ్నవి, ఆమె భర్త సుశాంత్ 4&5. రఘు మాస్టర్ & ప్రణవి 6. జెమిని యాంకర్ ప్రశాంతి 7. సింగర్ నోయెల్ 8. నందు (గీతా మాధురి భర్త) 9. జబర్దస్త్ ముక్కు అవినాష్ 10. కరాటే కళ్యాణి (నటి) 11. జోర్దార్ సుజాత (యాంకర్) 12. మెహబూబా దిల్ సే (టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) 13. యాంకర్ అరియానా గ్లోరీ (జెమిని కెవ్వు కామెడీ యాంకర్) 14. దేత్తడి హారిక 15. టీవీ9 యాంకర్ దేవి ఈ 15 మంది దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా.. ప్రియ వడ్లమాని, అపూర్వ, యామినీ భాస్కర్, పూనమ్ భజ్వా, అకిల్ సార్థక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
from https://ift.tt/3giedU1
No comments:
Post a Comment