Adipurush: ప్రభాస్ కంటే ముందుగానే మరో స్టార్ హీరోకు ఆఫర్ చేశారట! ఆయనెవరో తెలుసా..? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 21 August 2020

Adipurush: ప్రభాస్ కంటే ముందుగానే మరో స్టార్ హీరోకు ఆఫర్ చేశారట! ఆయనెవరో తెలుసా..?

ఆదిపురుష్.. ఈ భారీ మూవీ ప్రకటన వచ్చిన క్షణం నుంచి జనాల్లో చర్చలన్నీ ఈ సినిమాపైనే నడుస్తున్నాయి. హీరోగా నటించనున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందనుందని, దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌‌తో ఈ మూవీ ప్లాన్ చేశారని తెలుస్తుండటం సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అంతకు మించి అన్నట్లుగా ఈ మూవీ తెరకెక్కనుందనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా '' సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను మొదట 'అయోధి' పేరుతో తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నారు. శ్రీ రాముడి జన్మస్థలం అయిన అయోధ్య పేరు కలిసేలా ఈ టైటిల్ అనుకున్నారట. అంతేకాదు ఈ కథను బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌కి వినిపించారట కూడా. అయితే నుంచి పాజిటివ్ స్పందన రాకపోవడంతో.. అదే కథకు 'ఆదిపురుష్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ప్రభాస్‌తో రూపొందించేందుకు ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు చిత్రాన్ని భారీ రేంజ్‌లో ప్లాన్ చేసి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందించేలా నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. Also Read: ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందనేది చెప్పకనే చెప్పేసింది. చారిత్రక నేపథ్యంలో భారీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించనున్నారని సమాచారం. సీతగా కీర్తి సురేష్, రావణాసురిడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని తెలుస్తోంది.


from https://ift.tt/3aQI4Sv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages