YS Jagan: 15 ఏళ్లు పాటు జగనే సీఎం.. దుర్మార్గ పాలనతో టీడీపీ స్మాష్: నటుడు గిరిబాబు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 26 May 2020

YS Jagan: 15 ఏళ్లు పాటు జగనే సీఎం.. దుర్మార్గ పాలనతో టీడీపీ స్మాష్: నటుడు గిరిబాబు

మన పాలన వస్తుంది.. మన పాలన వస్తుంది.. అంటూ ధీమాగా చెప్పిమరీ ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయ దుందిభి మోగింగి ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల హామీలను తొలి ఏడాదిలోనే 90 శాతం పూర్తి చేశామన్నారు జగన్. ఎన్నికల మేనిఫేస్టోలో తాము చేస్తామన్నవి ఏమిటి? చేసిందేమిటి? అన్నదానిపై మీరే టిక్కులు పెట్టండి.. ఈ మేనిఫేస్టో‌ని మీ ఇంటికే పంపుతున్నా అంటూ తన పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ప్రజాభిప్రాయా సేకరణకు పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో రాజధాని మార్పు, కరోనా, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు విమర్శలు గుప్పిస్తారు. ఈ తరుణంలో సీనియర్ నటుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. టీడీపీ ఓర్చుకేలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుండంటూ దుయ్యబట్టారు. రామారావుగారి తరువాత రాజశేఖర్ రెడ్డి.. ఆ తరువాత ఇప్పుడు కనిపిస్తుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన చేసిందేమీ లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ వాళ్లది కడుపు మంట. జగన్ పాలనను చూసి ఓర్చుకోలేక చేస్తున్న దురాగతం, దుష్ప్రచారం తప్ప ఇంకోటి కాదు. ఐదేళ్ల అంతకంటే ఎక్కువ పాలించిన వాళ్లు ఏమీ చేయలేక రాష్ట్రాన్ని దిక్కుమొక్కు లేకుండా చేశారు. ఇలాంటి వాళ్లకు జనం గట్టిగానే బుద్ధి చెప్పారు. జగన్‌ని ముఖ్యమంత్రి చేశారు. ఆ ఉక్రోశం తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మళ్లీ జగనే సీఎం అవుతారు. మరో 15 ఏళ్లు పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా ఎక్కువ ఏళ్లు ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. నో డౌట్.. మళ్లీ జగనే సీఎం. ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది.. ఆ పార్టీ బట్టకట్టి బయటపడటం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాళ్లు చేసిన దుర్మార్గ పరిపాలనతో జనానికి విసుగొత్తి పోయింది. అందుకే అంత దారుణంగా ఓడించారు’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు గిరిబాబు. వైసీపీ ఎన్నికల్లో ఏడాది పూర్తైన సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిరిబాబు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయం నుండి ఆ పార్టీకి విధేయుడుగా ఉన్నారు. వైసీపీ ఏర్పాటు తరువాత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరిన ఆయన.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పార్టీ తరుపున ప్రచారం చేశారు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తొలిత కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. తదుపరి వైసీపీకి మద్దతు ప్రకటించారు.


from https://ift.tt/2B2q7Tf

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages