కొమరం భీం బర్త్ డే నాడు అల్లూరి సీతారామరాజు అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు . ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ ఎన్టీఆర్.. నేను మీకు రిటర్న్ గిఫ్ట్‌గా ఉన్నానని తెలుసు.. మీకు ప్రామిస్ చేస్తున్నాను అద్భుతమైన దాన్ని మీకు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాను. ముందు ముందు మరిన్ని వేడుకలు ఉండబోతున్నాయి’ అంటూ పోస్ట్ చేశారు రామ్ చరణ్. ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌గా కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. అయితే రామ్ చరణ్ బర్త్ డేకి ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి రామ రాజు టీజర్‌ను విడుదల చేశారు. ఆ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్ డేకి కొమరం భీం టీజర్ విడుదల చేస్తారని అందరూ భావించారు. అయితే లాక్ డౌన్ కారణంగా సాధ్యం కాకపోవడంతో రామ్ చరణ్ ఈ పోస్ట్ పెట్టారు. మరోవైపు దర్శకుడు రాజమౌళి సైతం ఎన్టీఆర్‌కి బర్త్ డే విషెష్ అందిస్తూ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం నాటి ఫొటోను షేర్ చేశారు. రాజమౌళికి దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయంగా కాగా.. ఎన్టీఆర్ ఈ చిత్రంతో తొలి విజయం అందుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరూ కలసి ‘సింహాద్రి’, ‘యమదొంగ’.. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో హిట్ కాంబోను రిపీట్ చేస్తున్నారు.
from https://ift.tt/2yfjYSu
No comments:
Post a Comment