అభిమానులూ నిరాశ చెందకండి.. నుంచి ఫస్ట్ లుక్, టీజర్ తప్పకుండా సంచలన విజయం మాత్రం అందిస్తాం అని చెప్పినా ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహంగానే ఉన్నారు. టీజర్ లేకపోతే లేకపోయింది.. కనీసం ఫస్ట్ లుక్ ఇచ్చినా సంబరం చేసుకునే వాళ్లం కదా.. అందులోనూ రామ్ చరణ్ బర్త్ డేకి ‘సీతారామారాజు’ టీజర్ ఇచ్చి.. మా ఎన్టీఆర్ బర్త్ డేకి ‘కొమరం భీం’ టీజర్ లేకుండా చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు (మే 20) ఎన్టీఆర్ బర్డ్ డే సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ.. సినిమాతో సంబంధం లేని ఓ పోస్టర్‌ని విడుదల చేసింది RRR చిత్ర యూనిట్. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం మరింత రెట్టింపు అయ్యింది. బర్డ్ డే టీజర్ లేకుండా చేసిన RRR చిత్ర యూనిట్‌ని బండ బూతులు తిడుతూ.. ‘మాకు ఫస్ట్ లుక్ వద్దు టీజర్ వద్దు కాని.. RRR యూనిట్ తరుపున నువ్వు 100 ట్వీట్లు వెయ్యి చాలు.. ఇదే నీకు పనిష్మెంట్’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ట్వీట్లు ఎందుకు చేయమంటున్నారంటే.. విషెష్‌తో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. 12 మిలియన్స్‌కి పైగా ట్వీట్లతో టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ కొనసాగుతున్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా RRR చిత్ర యూనిట్ చేసిన ట్వీట్‌పై బూతులే కాదు పంచ్‌లు అదే రేంజ్‌లో ఉన్నాయి. ‘పోనీలే కనీసం రాత్రి 12 గంటలకైనా ట్వీట్ చేశారు.. ఏ ఉదయం 10 గంటలకు చేయకుండా’.., ‘మీకంటే ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ నయం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ రిలీజ్ చేశాడు, కనీసం ఆ లుక్‌ని అయినా షేర్ చేయండి సంతోషిస్తాం’.., మీ వల్ల మూడ్ మొత్తం కరాబ్ అయ్యింది’ అని కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఎన్టీఆర్‌తో ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎన్నాళ్లైనా ఎదురు చూస్తాం.. మాకు కావాల్సింది పగిలిపోయే హిట్ అంటూ RRR చిత్ర యూనిట్ మద్దతు ప్రకటిస్తున్నారు మరికొంతమంది ఫ్యాన్స్.
from https://ift.tt/3cOmX3x
No comments:
Post a Comment