ప్లానింగ్ మొత్తం దెబ్బతింది.. RRR విడుదలపై నిర్మాత దానయ్య రెస్పాన్స్.. రిలీజ్ డేట్ చేంజ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 15 May 2020

ప్లానింగ్ మొత్తం దెబ్బతింది.. RRR విడుదలపై నిర్మాత దానయ్య రెస్పాన్స్.. రిలీజ్ డేట్ చేంజ్

దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సినిమాపై కూడా దెబ్బేసింది. బాహుబలి తర్వాత అంతే భారీ స్థాయిలో రూపొందుతున్న RRR సినిమా మరోసారి వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన నిర్మాత డీవీవీ దానయ్య RRR విడుదల తేదీపై కీలక విషయాలు చెప్పారు. అనుకున్న టైమ్‌కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం లేదని తేల్చేశారు. చెప్పినట్లుగానే వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన RRR మూవీని విడుదల చేయాలని అన్నివిధాలా ప్రయత్నించాం కానీ.. లాక్‌డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతిందని ఆయన తెలిపారు. చిత్రానికి సంబంధించి ఇంకా షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పిన దానయ్య, అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయడం కష్టమే అని చెప్పారు. దీంతో RRR మూవీ విడుదల వాయిదా అని కన్ఫర్మ్ అయింది. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రామ్ చరణ్ సీతారామరాజు లుక్ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. Also Read: ఇక మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా, నందమూరి అభిమానులు. ఇప్పటికే 80 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసిన రాజమౌళి.. లాక్‌డౌన్ కారణంగా మిగిలిన భాగం షూటింగ్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పనులు పూర్తి చేశాకే భారీ ఎత్తున రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం.


from https://ift.tt/2Z25h0h

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages