దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దగ్గుబాటి వారసుడు రానా ఇటీవల తన ప్రేయసి మిహికా బజాజ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేస్తూ పెళ్లి కబురు చెప్పగా.. నేడు (మే 20) వీరి నిశ్చితార్థం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరగబోతుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్‌కి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. రానా, మిహీకా కుటుంబ సభ్యులు మాత్రమే ఎంగేజ్‌మెంట్‌కి హాజరు కాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వార్త హాట్ టాపిక్ అవుతున్న తరుణంలో ఆ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వివాదాస్పద నటి షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇటీవల రానా-మిహీకాలకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీరెడ్డి.. రానాకి ఎంగేజ్ మెంట్ విషయాన్ని తెలియజేస్తూ.. మా బావకు పెళ్లి అంటూ పోస్ట్ పెట్టింది. రానా బావకు ఎంగేజ్ మెంట్ ఈరోజే. రామానాయుడు స్టుడియోలో.. నెక్స్ట్ నాదే’ అంటూ కన్ను కొట్టే ఎమోజీతో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. అయితే రానా తమ్ముడు అభిరామ్‌తో శ్రీరెడ్డి మధ్య రిలేషన్ ఉండగా.. వాళ్లు ఏకాంతంగా గడిపిన ఫొటోలను బహిర్గంతం చేసి ప్రకంపనలు రేపింది శ్రీరెడ్డి. అభిరామ్‌తో తనకు ఉన్న రిలేషన్‌ని బహిర్గత పరిచిన శ్రీరెడ్డి.. సమయం వచ్చిన ప్రతిసారి దగ్గుబాటి ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకుంటూ సురేష్ బాబు, రానా, వెంకటేష్‌లతో వరసలు కలుపుతూ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది శ్రీరెడ్డి. సురేష్ బాబుని మామా అని.. రానాని బావా అని.. వెంకటేష్‌ని చిన మామా అంటూ గతంలో కూడా వరసలు కలిపారు శ్రీరెడ్డి. అయితే తాజా పోస్ట్‌లో అభిరామ్ పేరుని ప్రస్తావించకుండానే నెక్స్ట్ పెళ్లి నాదే అంటూ ఫన్నీ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.
from https://ift.tt/2X6jOoQ
No comments:
Post a Comment