కరోనాను కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మే 31 దాకా లాక్‌డౌన్ కొనసాగించాల్సిందే అని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. కొన్ని రంగాలకు వెసులుబాటు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో సినిమా రంగానికి కూడా కాస్త వెసులుబాటు కల్పించి షూటింగ్స్ అనుమతించాలని కోరుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ మేరకు చిరంజీవి ఇంట్లో మంత్రి తలసానితో మీట్ ఏర్పాటు చేసి.. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సినీమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరారు. Also Read: ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు స్టైలిష్ స్టార్ మాత్రం తన 'పుష్ప' షూటింగ్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో మాట్లాడి ఆగస్టు నెల వరకూ వాయిదా వేయాల్సిందే అని సూచించారట అల్లు అర్జున్. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా టీం అందరి శ్రేయస్సు కోసం ఇంకో రెండు నెలలు ఆగుదాం అని అన్నారట. ఒకవేళ షూటింగ్స్ పర్మిషన్ వచ్చినా ఆగస్టు దాకా సెట్స్ మీదకు రాకూడని డిసైడ్ అయ్యారట. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పుష్ప టీం కూడా స్వాగతించిందని సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా ఆడిపాడుతోంది. చిత్రంలో బన్నీ ఊర మాస్ క్యారెక్టర్‌లో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నారు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో మైత్రీ మూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ బన్నీ అభిమానుల్లో ఆతృతను పెంచేస్తూ 'పుష్ప'పై భారీ హైప్ క్రియేట్ చేసింది.
from https://ift.tt/3bWzOiG
No comments:
Post a Comment